కన్న బిడ్డ హత్య కేసులో అరెస్టైన ‘మైండఫుల్’ ఏఐ సంస్థ సీఈవో సుచనా సేత్ మానసిక పరిస్థితిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. తన కొడుకును చంపి మృత దేమం పక్కనే లేఖ రాసి పెట్టింది.ఈ విషయాన్ని పోలీసులు తమ పరిశీలనలో గుర్తించారు. ఇక నేర విషయంలోకి వెళితే సుచనా సేత్ దంపతులు విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బాలుడి కస్టడీపై విచారణతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది .సుచనా తన కుమారుడి కస్టడీ అంశాన్ని పేపర్ పై ఐలైనర్ తో లేఖ రాసింది. ఆ లేఖలో తన కుమారుడు తనతోనే ఉండాలని, రాయడం జరిగింది. కోర్టు విడాకులు మంజూరు చేసినా సరే. కుమారుడు కస్టడీ హక్కు తనకే దక్కాలని ఆ లేఖలో పేర్కొంది. తన కొడుకును హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ఉంచిన బ్యాగ్ లోనే లేఖ కూడా పెట్టింది.
ఇదిలా ఉంటే కేసు విచారణ చేపట్టిన పోలీసులకు సుచనా ఏమాత్రం సహకరించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. సొంత బిడ్డను చంపానన్న పశ్చాత్తాపం ఆమెలో కనిపించలేదని పోలీసులు వెల్లడించారు. దీంతో ఆమెకు మానసిక శారీరక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్యాగ్ లో దొరికిన లేఖను పోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. తన భర్తతో ఉన్న విభేదాల తీవ్రత, కోర్టు ఆదేశాలపై ఆమెలో ఉన్న అసంతృప్తిని ఈ లేఖ ద్వారా అర్థమవుతుందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.తన కుమారుడితో భర్త గడిపేందుకు భర్తను కోర్టు అనుమతించడమే హత్యకు దారితీసిందని గోవా పోలీసులు చెబుతున్నారు. 2022లో వీరిద్దరు విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. తమ కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే అంశంపై కోర్టులో వాద ప్రతి వాదనలు జరిగాయి. భర్త ప్రతి ఆదివారం తన కుమారుడితో గడిపేందుకు న్యాయస్థానంఅనుమతించడంతో నిరాశకు గురైన సుచనా సేత్ కొడుకు హత్యకు పాల్పడిందని పోలీసు వర్గాలు …అధికారులు వెల్లడించారు.