చేతి చమురు వదులుతోంది. జేబు గుల్లవుతోంది. దోపిడీ మితిమీరుతోంది. ఓటేసేందుకు సొంతూరు వెళ్తున్న జనాల కు ప్రయాణ ఛార్జ్ షాక్ కొడుతోంది. ఎన్నికల ముంగిట జనానికి పెద్ద సమస్య వచ్చి పడింది. ఓటేద్దామని ఉత్సాహంగా ఊళ్లకు పయనమవుతున్న ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఛార్జీల మోతతో సతమత మవుతు న్నారు. హైద రాబాద్‌లో ఆంధ్రాకు చెందిన దాదాపు 30 లక్షల మంది నివసిస్తుంటారని అంచనా. వీరికి తోడు ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ప్రతినిత్యం హైదరాబాద్‌కు వేలాది మంది వస్తుంటారు. ఆంధ్రాలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండ డంతో ఇక్కడి వాళ్లంతా సొంతూరు బాట పడుతున్నారు. జనం పల్లెకు క్యూ కట్టడంతో ప్రయాణ ఛార్జీలు ఒక్కసారిగా పెరిగిపో యాయి. వందల్లో ఉండే ఛార్జీ వేలాది రూపాయలు పెరిగింది. చార్జీలను చూసిన జనం బెంబేలెత్తుతున్నారు.
మామూలు రోజుల్లో అయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు వెయ్యి రూపాయల దాకా బస్ ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడది 4 వేలు దాటింది. అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ దాదాపు 4 రెట్లు అధికంగా ఛార్జ్ వసూలు చేస్తున్నాయి. విశాఖతో పోల్చుకుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ దూరం చాలా తక్కువ. సాధారణ రోజుల్లో ఛార్జీ కూడా వందల్లో ఉంటుంది. కానీ, ఈ రూట్‌లోని ప్రయాణికులు కూడా 4 వేల దాకా పెట్టాల్సి వస్తోంది. రాజమండ్రి వెళ్లే వారు సైతం 4 వేలు సమర్పించు కోవాల్సి వస్తోంది. ఇక కడప వెళ్లే జనానికి 2వేల 500 రూపాయల దాకా ఖర్చు అవుతోంది. వేలల్లో ఖర్చు చేయాల్సి రావడంతో సామాన్యులకు భారంగా మారింది. ఛార్జీలను భరించలేని కొందరు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఏదో రకంగా వెళ్తున్నారు. అక్కడి నుంచి ఇతర వాహనాల్లో సొంతూరుకు వెళ్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బరితెగిస్తున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయి. మొన్నటిదాకా వందల్లో ఉన్న ఛార్జీలను ఉన్నపలంగా పెంచేశాయి. వేలల్లో ఛార్జీలు వసూలు చేస్తుండడంతో జనం జేబులు ఖాళీ అవుతున్నాయి. అవసరమైన సమయంలో అధికారులు సైతం కన్నెత్తి చూడకపో వడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు శృతిమించుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారుఇక ఆర్టీసీ వ్యవ హారం మరోలా ఉంది. డిమాండ్‌కు తగ్గట్టు ఆర్టీసీ బస్సుల్ని నడపడం లేదన్న విమర్శలొస్తున్నాయి. అవసరానికి సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితు ల్లో ప్రైవేట్ ట్రావెల్స్‌లో ప్రయాణించాల్సి వస్తోందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైళ్లు, ఆర్టీసీ బస్సుల సంఖ్యను మరింత పెంచితే ఛార్జీల భారం తప్పుతుందంటున్నారు ప్రజలు.


