ఐస్‌లాండ్ దేశంలోని గ్రాండావ్ సిటీ సమీపంలోని సిలింగర్ ఫెల్ అగ్నిపర్వతం బద్ధలైంది. డిసెంబర్ నుంచి ఈ అగ్ని పర్వతం బద్దలవడం వరసగా ఇది మూడోసారి. దీంతో దగ్గర్లోని బ్లూ లాగూన్ స్పా పరిసర ప్రజలను అక్కడి నుంచి ఖాళీచేయించారు. గత శుక్రవారం నుంచి ఇక్కడ వందలాది చిన్నపాటి భూకం పాలు సంభవించాయి. తర్వాత ఇలా ఒక్కసారిగా అగ్నిపర్వత బద్దలై వందల మీటర్ల ఎత్తుకు లావా ప్రవాహం ఎగిసిపడింది. దీంతో తీరనగరం గ్రాండావ్ లోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించా రు. దీంతో జనవరి 16 వరకు పర్యాటక ప్రాంతమైన బ్లూలాగూన్ మూసివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం కలగలేదు. లావా ముప్పున్న ప్రాంతాల పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధపెట్టారు. సురక్షింత అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.