ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు డైలాగ్ వార్ నడుస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్ని కలు సమీపిస్తున్న వేళ పార్టీలన్నీ పంచ్ డైలాగ్‌లతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఓవైపు అధికార పార్టీ మేము సిద్ధం…. మీరు సిద్ధమా అంటూ సవాల్ విసురుతోంటే… టీడీపీ రా కదిలిరా, శంఖా రావం పేరుతో ప్రతిసవాల్ విసురుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్న పార్టీలు… సై అంటే సై అంటున్నాయి.
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని అధికారంలో నుంచి దింపడానికి జన్మభూమి కమిటీలే కారణమన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే.. చంద్ర ముఖిని ఇంటికి తెచ్చుకున్నట్లే ఆయన… చొక్కా చేతులు మడిచే టైమొచ్చిందన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు టీడీపీ అధినేత గట్టి సమాధానం ఇచ్చారు. అయిదేళ్ల వైసీపీ నరక పాలన నుంచి విముక్తి పొందడానికి తిరగబడతారో లేక బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే తేల్చుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపుని చ్చారు. మొన్న విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఒకే వేదికను పంచుకున్నారు. 2లక్షల కోట్ల ఆదాయా న్నిచ్చే రాజధాని అమరావతిని విధ్వంసం చేసి..ఇప్పుడు నాలుగో రాజధాని హైదరాబాద్ అంటున్న వైసీపీ నేత లకు సిగ్గు లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. చొక్కా మడత పెడతామంటున్న జగన్‌కు… తాము కుర్చీ లు మడతపెడతపెట్టి సమాధానం చెబుతామన్నారు.విజయనగరం జిల్లా నెలిమర్ల శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జగన్మోహన్ రెడ్డి తనదైన స్టైల్‌లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే వైసీపీ నేతల్ని వదిలి పెట్టేదిలేదన్నారు. అందరి పేర్లు రెడ్‌బుక్ లో రాసుకుంటున్నానని మరోసారి ప్రకటించారు. తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామ న్నారు. మొత్తానికి సమ్మర్ మొదలవ్వకముందే ఏపీ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ఎన్నికలు సమీపించే కొద్దీ ఈ డైలాగ్ వార్ ఏ రేంజ్‌కు చేరుతుందో చూడాలి మరి.


