ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో కృష్ణ, గోదావరి జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగి.. వైరల్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 721 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ కారణంగా.. తమిళనాడు లోని ఐదు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఏపీ, తమిళనాడు సరిహద్దు జిల్లాలైన తిరువళ్లూరు, ఉమ్మడి వేలూరు జిల్లాలో అలర్ట్ జారీ చేశారు.