ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ షర్మిల స్పీడ్ పెంచారు. ఏపీలో పార్టీ బలోపే తంపై ఫోకస్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ కార్యకర్తలతో అంతర్గత సమావేశం నిర్వహించనున్నారు. ఏపీలో ఎన్నికలు దగ్గరపడు తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు యాక్టివ్ గా పనిచేయని సీనియర్ నాయకులను తిరిగి ట్రాక్ ఎక్కించడానికి షర్మిల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం గుంటూరు జిల్లాల పర్యటించారు. అక్కడ కార్యకర్తలతో భేటీ అయ్యారు. పనిలో పనిగా జగన్పై విమర్శానాస్త్రాలు సంధించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలనకు, జగన్ పాలనకు చాలా తేడా ఉందని చెప్పారు. జగన్ సొంత ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని.. బీజేపీకి బానిసగా మారాయని షర్మిల విమర్శించారు.