ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. పర్వతరెడ్డి ప్రయాణిస్తున్న కారు.. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్సీ కారు వెళ్లి లారీ వెనుక భాగంలో ఢీకొని డివైడర్‌పై పడిపోయింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌రెడ్డి పీఏ అక్కడికక్కడే మృతి చెందగా, ఎమ్మెల్సీ తలకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో అయిదుగురు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


