ఎమ్మిగనూరు టికెట్ కేటాయింపులో సిట్టింగ్ ఎమ్మేల్యే ప్రతిపాదించిన అభ్యర్ధికే పార్టీ అధిష్టానం తలొగ్గి టికెట్ కేటాయి స్తోందా? లేక పార్టీ అధిష్టానం జరిపిన సర్వేల ప్రకారం ఎంపిక చేసిన ఓ మహిళాఅభ్యర్దికే పార్టీ అధిష్టానం టికెట్ కేటా యిస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆ సిట్టింగ్ ఎమ్మేల్యే బీసీ వర్గాల చేనేత కుటుంబానికి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుకకు టికెట్ కేటాయించకుండాఎందుకు అడ్డుపడుతున్నారు ? ఇంతకీ వైసీపీ టికెట్ విషయం లో సర్వేలు, సామాజిక పరిస్టితులకు అనుగుణంగా పార్టీ అధిష్టానం కోరుకొంటున్న మహిళా అభ్యర్దికి కేటాయిస్తారా లేక సిట్టింగ్ ఎమ్మెల్యేసూచించిన కొత్త అభ్యర్ధికి టికెట్ కేటాయిస్తారా అన్న అంశంపై నియోజకవర్గంలో త్రీవంగా చర్చ నడుస్తోంది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ టికెట్ ఇప్పడు హాట్ టాపిక్‌గ్గా మారింది. సిట్టింగ్ ఎమ్మేల్యేను కాదని రాబోయే ఎన్నికల్లో బీసీలకు టికెట్ కట్టబెట్టాలని పార్టీ అధిష్టానం తీసుకొన్న నిర్ణయం ఇందుకు కారణంగా భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మేల్యే ఎర్రకోట కేశవరెడ్డితోపాటు, కర్నూలు మాజీ ఎంపి బుట్టా రేణుక, లింగాయ కార్పొరేషన్ చైర్మన్ వై. రుద్రగౌడ్ ముగ్గురిని పార్టీ అధిష్టానం విజయవాడకుపిలిపించి చర్చలు జరిపారు. పార్టీ అధిష్టానం పెద్దలు సిట్టింగ్ ఎమ్మేల్యే ఎర్రకోట కేశవరెడ్డి వయోభారం కారణంగా, వచ్చే ఎన్నికల్లో విజయావకాశలపై సర్వే రిపోర్టుల ప్రాతిపదికగా 2024 ఎన్నకల్లో బీసీలకు టికెట్ కేటాయించాలన్న పార్టీ నిర్ణయంపై చర్చించారు.
బీసి వర్గాల్లో చేనేత వర్గానికి చెందిన వారికి టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనను అధిష్టానం పక్కన పెట్టడాన్ని ఎమ్మేల్యే వర్గీ యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్టితుల్లో టికెట్ తనకు కేటాయించకపోతే తానుసూచించిన బీసీ వర్గానికి చెందిన మాచాని వెంకటేష్‌కు టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. మాచాని వెంకటేష్‌కు టికెట్ కేటాయి స్తే, ఎన్నికల్లో సహకరించి, విజయం కొసం పనిచేస్తామని చెప్పిన్నట్టు సమచారం.
సిట్టింగ్ ఎమ్మేల్యే ఎర్రకోట కేశవరెడ్డి సూచించిన చేనేత వర్గాలకు చెందిన మాచాని వెంకటేష్‌తో పోలిస్తే మాజీ ఎంపీ బుట్టా రేణుకమ్మ ఎమ్మెల్యే హోదాకు అర్హురాలని పలువురు భావిస్తున్నారు. అర్ధికంగా కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణు కతో పోలిస్తే, మాచాని వెంకటేష్‌ది ఆమె స్టాయికి తలతూగడని ఆ పార్టీ కార్యకర్తలల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఎంపీ హోదాలో పనిచేసిన సమయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలో నందవరం మండల కేంద్రాన్ని దత్తత తీసుకొని ఎన్నో అభివృద్ది పనులను చేపట్టింది. మరి కొన్ని పనులకు కొందరు రాజకీయ నేతలు అడ్డుతగలటంతో కోట్ల రూపాయల విలువైన పనులు నిరుపయెగంగా మారాయి. వీటన్నికితోడు బుట్టా రేణుక ఒకసారి అవకాశం ఇస్తే, ఇక నియోజకవర్గం బీసీల పరం అవుతోందని, భవిష్యత్‌లో అమె ఇక్కడ తిష్టవేయటం వల్ల భవిష్యత్‌లో తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నర్దకరంగా మారు తుందని కొందరు అలోచిస్తున్నట్టు నియోజకవర్గం పరిధిలోని వైసీపీ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
పార్టీ టికెట్ కేటాయించి ఎన్నికల్లో నెగ్గితే మహిళ కోట కింద మంత్రి పదవి చేపట్టితే రాబోయే రోజుల్లో ప్రజలు అమెను ఆదరిస్తారని, రాజకీయంగా తమ ప్రాబల్యం తగ్గిపోతుందని, భావించి ఎలాంటి రాజకీయ అనుభవం లేని మాచాని వెంకటేష్‌ను తెరమీదికి తెచ్చారని నియాజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ టికెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మేల్యే ఎర్రకోట కేశవరెడ్డిది పైచేయి అవుతుందా లేక పార్టీ అధిష్టానం నిర్ణయం ఫైనల్ అవుతుందా అనేది తేలాల్సి ఉంది.


