గత కొద్ది రోజులుగా ఏ క్షణమైనా ఇలాంటి ప్రకటన రావచ్చని భావించిన వాళ్ల అంచనాలే చివరికి నిజమయ్యాయి. అవును.. రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను టార్గెట్ చేశాయంటూ చెప్పుకొచ్చిన ఆయన.. 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటు న్నట్లు తెలిపారు. అయితే.. పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలన్న తన నిర్ణయం తాత్కాలికమేనని చెప్పడం ఆయన అభి మానులకు కాస్త ఊరటనిచ్చే అంశం.
సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార, విపక్షాలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి వేళ సంచలన ప్రకటన చేశారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారాయన. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు.. కనీసం ఊహించ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ చూస్తూ పార్లమెంటులో మౌనంగా కూర్చోలేను అంటూ టీడీపీ నేతలు, కార్యకర్తల సమక్షంలో వ్యాఖ్యానించారు గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్. ముఠా రాజకీయాల నుంచి దూరంగా ఉన్నట్లు చెప్పిన గల్లా… ఇప్పటివరకు స్థానిక నాయకులు, ప్రజలను నమ్ముకొని ముందుకెళ్లినట్లు వెల్లడించారు. రాష్ట్ర సమస్య లు, ప్రధానంగా ప్రత్యేక హోదా, రాజధాని అమరావతి కోసం పార్లమెంటులో గళమెత్తానని.. అవిశ్వాసం పెట్టినప్పుడు పార్టీ గొంతు వినిపించానన్నారు. అయితే… అది దృష్టిలో పెట్టుకొని వివిధ కేసులో ఈడీ రెండుసార్లు తనను పిలిచి విచారిం చిందని ఆరోపించారాయన. ప్రస్తుతం తమ వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయని.. సీబీఐ, ఈడీ తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయని చెప్పుకొచ్చారు గల్లా జయదేవ్.
రెండేళ్ల క్రితం తన తండ్రి వ్యాపారాల నుంచి రిటైర్ కావడంతో…వ్యాపారం, రాజకీయాలు రెండింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమవుతోందన్నారు గల్లా జయదేవ్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకోవడంతో ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండేలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే.. వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని ఆయన వెల్లడించడం పార్టీ శ్రేణులకు, అభిమానులకు కాస్త ఊరటనిచ్చే అంశం. నిజానికి.. గత కొన్ని నెలలుగా ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు గల్లా జయదేవ్. అమర్‌రాజా సంస్థలకు ఏపీలో తలెత్తిన ఇబ్బందుల కారణంగానే తెలంగాణలో ఆయన తన వ్యాపారాన్ని విస్తరించారన్న వాదనా ఉంది. దీంతో… 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా లేదా అన్న సందేహాలు గత కొద్ది రోజులు గా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలతో విసిగి పోవడం వల్లే ఆయన ఓ గట్టి నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రా యాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా విన్పించడం మొదలు పెట్టాయి. చివరకు ఇప్పుడు ఇలా ఆయన ప్రకటన చేయ డం జరిగిపోయింది. 2024 ఎన్నికల్లో పోటీ చేయనన్న ఆయన.. మళ్లీ రాజకీయాల్లోకి కొంత కాలం తర్వాత వస్తా అన్నా రు..అది ఎప్పుడు అన్నది తేలాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.


