తెలంగాణ ప్రభుత్వం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ అదన పు ప్రయోజనం లేదని కాగ్ పేర్కొంది. రీ ఇంజినీరింగ్, మార్పుల కారణంగా అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్ధకమ య్యాయని.. దీంతో 765కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ అనుచిత తొంద రపాటు ప్రదర్శించిందని…. డీపీఆర్ ఆమోదా నికి ముందే25వేల కోట్ల విలువైన 17 పనులు అప్పగించారని పేర్కొంది. అవసరం లేకున్నా కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టారని…. దీనివల్ల 25వేల కోట్లు అదనంగా ఖర్చయిందని పేర్కొంది. సాగునీటిపై మూలధన వ్యయం ఒక్కో ఎకరానికి 6.42లక్షలు అవుతుందని… అంచనా వేశారు. లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని నివేదికలో కాగ్ పేర్కొంది.


