వికారాబాద్ జిల్లా పరిగి మండలం జీడిగడ్డ తాండా వద్ద ఉద్రిక్తత నెలకొంది. భూమి పరిశీలించేందుకు రాత్రి సమయంలో వచ్చిన ఆర్డీవో, ఎమ్మార్వోలను గిరిజనులు అడ్డుకున్నారు. గిరిజన మహిళలు కర్రలతో వచ్చి ఆర్డీవో, ఎమ్మార్వో వాహనాలకు అడ్డుగా నిలుచున్నారు. రాత్రి సమయంలో వచ్చి భూములు పరిశీలించడం పై తాండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ భూములను ఎలా పరిశీలిస్తారని రైతులు నిలదీశారు. కొన్నేళ్లుగా ఇవే భూముల్లో వ్యవసాయం చేస్తున్నామని.. రాత్రి పూట వచ్చి వేరొకరివి అని ఎలా చెబుతారని రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదంటున్నారు గిరిజనులు.