27.8 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

అయోధ్య రామయ్య వైభవం

     సనాతన భారతీయ ధర్మంలోని గొప్పదనం ప్రపంచానికి విదితం అవుతోంది. జ్ఞానమయ పవిత్ర స్థానం అయోధ్య. బాల రామయ్య జనన స్థానం అయోధ్య. ఆ అయోధ్య ఇప్పుడు త్రేతాయుగం నాటి వైభవాన్ని జ్ఞప్తికి తెస్తోంది. రామా యణ మహాకావ్య ఘట్టాలను గుర్తుకు తెస్తోంది.

     పవిత్ర సరయూ నదీ తీరాన వున్న అయోధ్య సప్త మోక్ష క్షేత్రాల్లో ఒకటి. దేవగణాలతో నిర్మితమైన గొప్ప నగరం. ఇది పురాణ వాక్కు. అంతటి అయోధ్య బాల రామ మందిరం ఆవిష్కార ముహూర్తం ఘడియల్లోకి వచ్చేసింది. హిందువుల ఆత్మ గౌరవ నినాదం విశ్వచరిత్రలో సువర్ణాక్షర లిఖితం అవుతోంది. ఈ మహత్తర శక్తిని ప్రపంచ నలుమూలలకు చాట డంలో భారతీయుల అందరి పాత్ర ఉంది. సాధు సంతులున్నారు,కోట్లాది మంది రామభక్తులున్నారు, హిందూ సంఘా లున్నాయి, ఆర్ఎస్ఎస్ ఉంది, వి హెచ్ పీ ఉంది, భజరంగదళ్ ఉంది, ఎన్నో కులాలున్నాయి, మరెన్నో మతాలున్నా యి. ..యావత్ భారత జాతి ఈ మహాక్రతువుకు భాగస్వామ్యం అయ్యింది. రాముని పట్టాభిషేక సమయంలో మంథర, కైకేయి అసూయపర్వం ఎన్ని మార్పులకు కారణం అయ్యిందో తెలిసిందే. ఆ అసుర గుణాలు ఎవరూ ప్రదర్శించకుం డా ఇప్పుడు అందరూ..బాల రామయ్య భవ్య, దివ్య మందిర ఆవిష్కార వేడుకలో పాల్గొని విజయవంతం చేసుకోవడం నిజంగా శుభపరిణామం.

       దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీమహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో సప్తమ అవతారం రామావతారం. సప్తగిరీశుని శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం.. త్రేతాయుగాన్ని, ఆ ధర్మ ప్రభువును …కౌసల్యా సుప్రజా రామా.. అంటూ మొదలవుతుంది. బాలరాముడి ప్రతిష్ఠామహోత్సవం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా 2024, జనవరి 22వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బాల రామయ్య దర్శనానికి భగవత్ బంధువులు, విశ్వవ్యాప్త ప్రజలు ఉవ్విళూరుతున్నారు. అయితే, ప్రాణ ప్రతిష్ఠకు ముందే పద్మ పీఠంపై ముగ్ధమనోహర రూపంలో 4.25 అడుగుల ఎత్తులోవున్న బాలరాముడి విగ్రహ చిత్రాలు అంతటా దర్శన మిస్తు న్నాయి. 84 స్తంభాల దివ్య భవ్య మందిరం అయోధ్య బాలరామయ్య ఆలయం.

     అందరి చూపు అయోధ్య వైపే. అన్నిదారులు అయోధ్యకే. ఏ నోట విన్నా బాల రామయ్య పాటే. ఏ చోటు చూసినా చిన్నారి రాముడి ఆరాధనలే. మొబైల్ ఫోన్లలో రింగ్ టోన్లు, కాలర్ టోన్లు బాల రాముడిని కీర్తిస్తూనే దర్శనమిస్తున్నాయి. సోషల్ వీడియో పోస్టులు అన్నీ బాల రామయ్య చేష్టల మీదే. అయోధ్య దివ్యభవ్య బాల రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య జన సాంధ్రమైంది. అయోధ్య అంతటా భద్రత ఏర్పాటు చేశారు. 12 వేల మంది భద్రతా సిబ్బం దిని ఏర్పాటు చేశారు. దాదాపు పదివేల సీసీ కెమెరాలు అమర్చారు. పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ, బంగారు విల్లు, బాణాలు ధరించిన అయిదేళ్ల బాలుడి రూపంలో ఉన్న సుందర రామయ్య విగ్రహం దర్శనమిస్తోంది. 51 అంగు ళాల మహోన్నత బాల రామయ్య విగ్రహాన్ని కృష్ణశిలపై సుందరంగా చెక్కిన ధన్యశీలి మైసూరుకు చెందిన శిల్పి యోగి రాజ్.

      రామదండుతో లంకా నగరానికి శ్రీరామచంద్రుడు చేరుకున్నప్పుడు ఓ ఉడత సైతం సాయం అందించి శ్రీరామ చంద్ర ప్రభువు అభిమానానికి పాత్రురాలైంది. ఇక, అయోధ్య బాలరామయ్య దివ్య, భవ్య విగ్రహ ప్రతిష్ఠాపనలో తాము సైతం అంటూ ఎందరెందరో ముందుకొచ్చారు. రామపాదాలను శిరస్సున ధరించి… ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి భరతుడు రాజ్యపాలన చేశాడు. బాల రామయ్యకు బంగారు పూత పూసిన పాదరక్షలు సమర్పించడానికి హైదరాబాద్ కు చెందిన ఓ మహా భక్తుడు, వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా ఎనిమిది వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి అయో ధ్యకు చేరుకున్నారు. ఆయన ఈ సువర్ణ పూరిత పాదరక్షలు అయోధ్యలో సమర్పించనున్నారు.

      మహరాష్ట్ర వాసులు 500 కిలోల కుంకుమను అయోధ్యకు పంపారు. కర్ణాటక హంపీ ప్రాంతంలోని కిష్కింద నుంచి ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది. ఈ ప్రాంతాన్ని ఆంజనేయస్వామి జన్మస్థలంగాకొందరు భక్తులు విశ్వసిస్తున్నారు. సీతామా జన్మస్థలం నేపాల్ లోని జనక్ పురకు ఈ రథాన్ని తొలుత తీసుకెళ్లి అక్కడ పూజలు చేశారు. ఇప్పుడు సరయూ నదీ ఒడ్డున ఈ రథాన్ని ఉంచారు. ఢిల్లీ రామాలయంలో సేకరించిన ధా, కౌన్ జ్ నుంచి తెచ్చిన సుగంధ ద్రవ్యాలు అయోధ్యకు చేరుకున్నాయి. ఇక రామ, రావణ యుద్ధక్షేత్రమైన శ్రీలంక నుంచి ఓ ప్రతినిధి బృందం అశోక వాటిక ప్రత్యేక కానుకను పంపారు. ఉజ్జయినీ మహంకాళీ ఆలయ నిర్వాహకులు అయిదు లక్షల లడ్డూలను పంపగా, మథుర శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి 200 కిలోల లడ్డూలు అయోధ్యకు చేరుకున్నాయి. విశ్వవ్యాప్త మహా పుణ్యక్షేత్రం తిరుమల నుంచి లక్ష లడ్డూలు అయోధ్యకు చేరాయి. భక్తుల కోసం ఏడు వేల కిలోల రామ్ హల్వాను నాగపూర్ కు చెందిన చెఫ్ పంపిం చారు.

         అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకార్యక్రమ సన్నాహాలు అయోధ్యలో అట్టహాసంగా సాగుతుండగా, థాయ్ లాండ్ దేశంలో అయోధ్య భవ్య దివ్య బాల రాముడి ప్రాణప్రతిష్థా మహోత్సవ వేడుకలు తిలకించేందుకు పెద్ద పెద్ద స్క్రీన్లతో ఏర్పాట్లు చేశారు. ఆ దేశంలో అయోధ్యా అనే పురాతన పట్టణం ఉందని..ఈ రెండిటి పేర్లు, మతపర విశ్వా సాల్లో సామీప్యం ఉన్నట్టు తెలుస్తోంది. జాతిని, ధర్మాన్ని, దేశాన్ని, సంస్కృతిని రక్షించుకోవడానికి వ్యక్తిని సంసిద్ధంచేసే మహత్తర కావ్యం రామాయణం. ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి మనిషి కోరుకునే జ్ఞానం, మోక్షం సిద్దింప చేసేది రామాయ ణం. అయోధ్యకు, కంచి పుణ్యక్షేత్రానికి సంబంధం వుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ముక్తిని ప్రసాదించే పుణ్య క్షేత్రాలో దేశంలో ఏడు ఉన్నాయని తెలియజేస్తారు. ఈ ఏడింటిలో అయోధ్య, కంచి వున్నాయి. రామాయణ కాలంలో దశరథ మహారాజు కంచి పుణ్యక్షేత్రంలో అమ్మవారిని ఆరాధించాకే పుత్ర సంతానం కల్గిందనే పురాణ కథనాలు ఉన్నా యి. అందాల రాముడు ఎందుకు దేవుడు అంటే… రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచి, అనుభవించ వల్సిన వయసును అడవిపాలు చేసి, సామాన్యుని వాక్కును జనవాక్కుగా చేసి సర్వకష్టాలు ఎదుర్కొన్న మహోన్నతుడు శ్రీరామచంద్రుడు.. అందుకే దేవుడు అని రామభక్తులు చెబుతారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్