33.3 C
Hyderabad
Sunday, March 1, 2026
spot_img

అత్యంత ప్రజాదరణ కలిగిన రెండో సీఎం యోగి ఆదిత్యనాథ్

     యోగి ఆదిత్యనాథ్ … పరిచయం అక్కర్లేని నాయకుడు. యోగి ఆదిత్యనాథ్‌ ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయినా దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న లీడర్. ప్రస్తుతం దేశంలోనే అత్యంత పెద్దదైన ఉత్తరప్రదేశ్‌కు రెండోసారి ముఖ్యమంత్రి గా ఉన్నారు యోగి ఆదిత్యనాథ్‌. వాస్తవానికి 2017 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ పాత్ర ఏమీ లేదు. అప్పటికి ఆయన గోరఖ్‌పూర్‌ ఎంపీగా ఉన్నారు. నరేంద్ర మోడీ మేజిక్ తో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారానికి వచ్చింది. అయితే ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలన్న అంశంపై బీజేపీ పెద్దలు మల్లగుల్లాలు పడ్డారు.చివరకు గోరఖ్‌ పూర్‌ మఠం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయిన యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రిగా కమలం పార్టీ హై కమాండ్ నియమించింది.

       2017 మార్చి 18న తొలిసారిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల పదవీకాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు యోగి ఆదిత్యనాథ్‌. ఉత్తరప్రదేశ్‌లో వరుసగా ఐదేళ్లు అధికారం లో ఉన్న తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రికార్డు సృష్టిం చారు. అప్పటివరకు ఉత్తరప్రదేశ్‌లో వరుసగా ఐదేళ్లు బీజేపీ నాయకుడెవరూ ముఖ్యమంత్రిగా పని చేయలేదు. ఆ తర్వాత 2022 ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించింది.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించారు. 2022 మార్చి 25న రెండోసారి ముఖ్యమంత్రిగా యోగి ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్ అంటే ఒకప్పుడు అల్లర్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. పారిశ్రామికవేత్తలను గ్యాంగ్‌స్టర్‌లు బెదిరించి, డబ్బు గుంజడం సర్వ సాధా రణంగా ఉండేది. కొన్ని జిల్లాల పేర్లు చెబితేనే, ప్రజలు గడగడ వణికేవారు.అయితే ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతల సమస్యకు యోగి ఆదిత్య నాథ్‌ టాప్ ప్రయారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణ స్వీకారం చేశాక, ఉత్తరప్రదేశ్‌ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ్యాంగ్‌స్టర్స్ ఏరివేత కార్యక్రమం ప్రారంభించింది యోగి సర్కార్. ఎప్పుడు ఎక్కడ ఎన్‌కౌంటర్ జరుగుతుందో, శరీరంలోకి ఎప్పుడు తూటా దిగుతుందో అని గ్యాంగ్‌స్టర్లు, ప్రొఫెషన్ క్రిమినల్స్ హడలిపోవడం మొదలైంది. దీంతో ఉత్తరప్రదేశ్‌లో ప్రశాంతత నెలకొంది.

      మరోవైపు ఉత్తరప్రదేశ్‌ను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడానికి కూడా యోగి ఆదిత్యనాథ్ తీవ్ర కృషి చేశారు. ప్రశాంతత నెలకొనడంతో ఉత్తరప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి మిగతా ప్రాంతాల నుంచి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. దీంతో పారిశ్రామికవేత్తలకు యోగి సర్కార్ రెడ్ కార్పెట్ పర చింది. ఉత్తరప్రదేశ్‌కు భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అంతి మంగా పారిశ్రామికంగా ఉత్తరప్రదేశ్ దూసుకుపోయింది. మౌలిక సదుపాయాల కల్పనలో యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం విజయాలు నమోదు చేసుకుంది. రవాణారంగాన్ని ఆధునీకరించడానికి యోగి సర్కార్ ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌కు మెట్రో రైళ్ల వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేనన్ని మెట్రో రైళ్లు ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయి. అలాగే విమానాశ్రయాల అభివృద్ధికి కూడా యోగి సర్కార్ ప్రయారిటీ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం మొత్తం తొమ్మిది విమానాశ్రయాలు ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఉత్తరప్రదేశ్‌ లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయింది. ఇందులో భాగంగా డిజిటల్ చెల్లింపుల ద్వారా గ్రామీణ ఎగుమతులను ప్రోత్సహించింది. రైతులు నేరుగా మండీల నుంచి ప్రయోజనాలు పొందేలా చూసింది. కాగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇండ్ల నిర్మాణానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన అలాగే సీఎం ఆవాజ్ యోజన కింద లక్షలాది మందికి ఇండ్లు నిర్మించింది. వీటన్నిటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాథి అవకాశాలు కల్పించింది. యోగి ఆదిత్యనాథ్ విధానాలపై విమర్శలు లేకపోలేదు. బుల్‌డోజర్ రాజకీయాలు అని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఈ విమర్శల సంగతి ఎలాగున్నా, ఉత్తరప్రదేశ్‌ బీజేపీకి కొండంత అండ యోగి ఆదిత్యనాథే. ఇందులో రెండో ముచ్చటే లేదు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్