జీతాలు పెంచాలని దాదాపు మూడు వారాలుగా అంగన్ వాడీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఆ ఒక్కటి కాక మరేదైనా అడగండి అన్నట్టు జగన్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇదే దారిలో మున్సిపల్ కార్మికులు, ఆ తర్వాత కాంట్రాక్టులు ఇలా అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కో విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు సిద్దమవుతున్నారని సమాచా రం. ఈ నేపథ్యంలో ఏపీ వైసీపీ ప్రభుత్వం అంగన్ వాడీఉద్యోగులకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే విధుల్లోలి వెళ్లాని ఆదేశాలను జారీ చేశారు. సత్వరమే విధుల్లోకి వెళ్లకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. విధులకు హాజరు కాని అంగన్ వాడీ ఉద్యోగుల వివరాలను ఎప్పటికప్పుడు అందిచాలని, కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ తో అంగన్ వాడీ ఉద్యోగులు పలు విధాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల గృహాలను ముట్టడించితమ వినతి పత్రాలను వారికి అందిం చారు. అంగన్ వాడీ ఉద్యోగులు వెళ్లిన ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ప్రజా ప్రతినిధులను నిలదీశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఒకవైపు విధుల్లో చేరాల్సిందేనని ఖరాఖండిగా చెప్పింది. కానీ అంగన్ వాడీ ఉద్యోగులు తమ డిమాండ్ లను పరిష్కరించే వరకు విధుల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో ఈ నెల 5వ తేదీలోపు విధులకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేసింది. విధులకు హాజరుకాని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. మరి అంగన్ వాడీ ఉద్యోగులు సమ్మె విరమిస్తారా? లేక కొనసాగిస్తారా అనేది వేచి చూడాల్సిందే..