28.2 C
Hyderabad
Thursday, October 23, 2025
spot_img

హస్తిన చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు

     ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు తరుముకువస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పెద్దల నుంచి పిలుపువచ్చింది. మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడుకు కమలం పార్టీ హస్తిన పెద్దల నుంచి చర్చలకు పిలుపు రావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హల్‌చల్ చేసింది.

         ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన కొంతకాలంగా ఒక జట్టుగా పోరాడుతు న్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీచేస్తాయన్నది పాత ముచ్చటే. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయనను పరామర్శించడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లారు. ఈ సందర్భంగా జైలు బయట మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అయితే అప్పటికి జనసేన ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీని సంప్రదించకుండా తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తామని పవన్ కల్యాణ్ ఏకపక్షంగా ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరచింది. తెలుగుదేశం, జనసేన పొత్తుకు సంబంధించి ఎవరికీ అనుమానాలు లేవు. అయితే ఈ రెండు పార్టీలతో బీజేపీ కలిసి నడుస్తుందా ? లేదా ? అనే ప్రశ్న కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయా ల్లో హల్‌చల్ చేస్తోంది. ఒకదశలో భారతీయ జనతా పార్టీ ఒంట రిగా పోటీ చేస్తుందన్న ప్రచారం కూడా జరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే బీజేపీ దారి ఎటు అనే అంశంపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో గందరగోళానికి తెరదించుతూ చంద్రబాబు నాయు డుకు బీజేపీ ఢిల్లీ పెద్దల నుంచి ఆహ్వానం అందింది. దీంతో అంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తాయన్న విషయం స్పష్టమైంది.

       విభజన తరువాత 2014లో తొలిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, తెలుగు దేశం, జనసేన కలిసి పోటీ చేశాయి. ఈ కూటమికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు. నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్య మంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో 2014 మరోసారి రిపీట్ అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు సీట్ల పంపకంపై ఒక స్పష్టత రాలేదు. సీట్ల పంపకానికి సంబంధించి మూడు రాజకీయ పార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే వ్యవహరించాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి నలభై ఏళ్ల చరిత్ర ఉంది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను సుదీర్ఘకాలం పరిపాలించింది. దీంతో పసుపు పార్టీకి గ్రామగ్రామాన క్యాడర్ ఉంది. వీటన్నిటికీ మించి ఒక విజనరీగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సామాన్య ప్రజల్లో ఇమేజ్‌ ఉంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మంచి అడ్మినిస్ట్రేటర్‌గా చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకున్నారు.

        ఇక జనసేన విషయానికొస్తే, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ప్రజల్లో విపరీతమైన చరిష్మా ఉంది. జగన్ సర్కార్ వైఫల్యాలను ప్రజల పక్షాల నిగ్గదీసి అడిగే నేతగా జనంలో ఇమేజ్ తెచ్చుకున్నారు పవన్ కల్యాణ్‌. ఆయన ఎక్కడ బహిరంగ సభ పెట్టినా, తండోపతండాలుగా జనమే జనం. వీటన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్‌లోని ఒక సామాజికవర్గం అండదండా పవన్‌ కల్యాణకు ఉన్నాయంటారు రాజకీయ పరిశీలకులు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఉనికి నామమాత్రమే. విశాఖపట్నం వంటి కొన్ని ప్రాంతాల్లో మినహా కమలం పార్టీకి క్షేత్రస్థాయిలో ఎక్కడా పట్టులేదు. అయితే ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీకి జాతీయస్థాయిలో ఉన్న ఇమేజ్ మరేఇతర నాయకుడికి లేదు. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారందరూ ఇమేజ్ విషయంలో నరేంద్ర మోడీ తరువాతే. అయోధ్యలో రామమందిర నిర్మాణం తరువాత సాధారణ ప్రజల్లో నరేంద్ర మోడీ ఇమేజ్ మరింతగా పెరిగింది. ఇదొక్కటే కాదు మోడీ హయాంలో ప్రపంచంలోనే భారత్ ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ పట్ల ఆంధ్రప్రదేశ్‌ లో సానుకూల పవనాలు వీస్తాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నాయక త్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ సర్కార్ విధానాలపై తెలుగుదేశం, జనసేన పార్టీలు కొంతకాలంగా సమరభేరి మోగిస్తు న్నాయి. జగన్ సర్కార్‌ విధానాల్లోని డొల్లతనాన్ని ఈ రెండు పార్టీలు బయటపెట్టాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఇప్పటికి పదేళ్లు కావస్తోంది. ఈ పదేళ్ల కాలంలో విభజన హామీల అమలుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపలేదు. సామాన్యప్రజలు ఈ విషయాన్ని గమనించారంటున్నారు రాజకీయ పరిశీల కులు. ఏమైనా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే విజయం తప్పదన్న అంచనాలు ఇప్పటికే రాజకీయవర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్