25.2 C
Hyderabad
Friday, February 14, 2025
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

 చంద్రబాబుకు రక్తాభిషేకం చేసిన బుద్దా వెంకన్న

    విజయవాడ వెస్ట్ టికెట్ కోసం బుద్దా వెంకన్న ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వాలని అధినేత చంద్ర బాబును కోరుతున్న వెంకన్న.. చంద్రబాబుపై తన అభిమానం చాటుకున్నారు. తన రక్తంతో చంద్రబాబుకు అభిషేకం చేశారు బుద్దా వెంకన్న. రక్తంతో గోడపై సీబీఎన్ జిందాబాద్.. నా ప్రాణం మీరే అంటూ రాశారు. చంద్రబాబు తనకు దేవుడన్న బుద్దా.. ఆ స్వామి భక్తి నిరూపించుకునేందుకే రక్తాభిషేకం చేశానని తెలిపారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శించనని తెలిపారు. చంద్రబాబు కుటుంబం తప్ప వేరే ఎవరూ తనకుకు నాయకులు కాదన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, పార్టీ కోసం నిలబడే వాళ్లకు అవకాశం ఇవ్వాలని బుద్ధా కోరారు.

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో ఐటి అధికారుల సోదాలు

హైదరాబాద్‌ ఎల్బీనగర్ లో ఐ.టి అధికారుల సోదాలు జరుగుతున్నాయి. మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు, బిజినెస్ పాట్నర్ ప్రతివా రెడ్డి ఇంట్లో నిన్న రాత్రి నుండి ఐటీ అధికారుల సోదాలు కొనసాగు తున్నాయి. ఎల్బీనగర్‌లో ఐ.టి అధికారుల సోదాలు చేస్తున్నారు. బిజెపి నేత శ్రీ రాములు ఇంట్లో ఐటీ సోదాలు చేస్తున్నా రు. గత ఎన్నికల్లో మహేశ్వర్ నుంచి రాములు పోటీ చేశారు. రాములు పిఏ ఇంట్లో కూడా ఐటీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు.

బీజేపీ జాతీయ మహాసభలో మోదీకి ఘనసత్కారం

2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఘనవిజయం సాధించి, మూడోసారి మోదీని ప్రధాని చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ మహాసభ సందర్భంగా ప్రధాని మోదీని గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , ఇతరమంత్రులు పాల్గొన్నారు. 75 ఏళ్లలో ఈ దేశం 17 లోక్ సభ ఎన్నికలు, 22 ప్రభుత్వాలు, 15 మంది ప్రధానమంత్రులను చూసిందని అమిత్ షా అన్నారు. దేశంలోని ప్రతి ప్రభుత్వం ఆయా కాలానికి అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించిందన్నారు. అయితే మోదీ పదేళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో సర్వతో ముఖాభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు.

టీచర్లకు మెరుగైన శిక్షణ

ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు మెరుగైన శిక్షణ ఇస్తూ… విద్యార్థులకు న్యాయమైన విద్యను అందిస్తామని తెలంగాణ రికగ్నైసుడ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సిద్దాల బీరప్ప అన్నారు. తస్మా రాష్ట్ర అధ్యక్షుడు సాదుల మధుసుదన్ సమక్షంలో జిల్లా నూతన అధ్యక్షుడిగా సిద్దాల బీరప్ప, ప్రధాన కార్యదర్శిగా గుల్శాని ప్రమాణ స్వీకారం చేశారు. నూతన ఉత్సాహంతో సంస్థ పరిధిలోని పాఠశాలన్నింటినీ ఐక్యం చేసి, ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని తెలిపారు.

మిర్చి రైతుల ఆవేదన

మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోవడంతో రైతులు మిర్చి పంటను గోదావరి ఇసుకలో ఆరబెట్టుకుంటున్నారు. అయితే అన్నారం బ్యారేజ్ నీటిని దిగువకు వదలడంతో గోదావరిలో ఆరబెట్టిన మిర్చి నీటి ప్రవాహానికి కొట్టుకపోతుందని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ నుండి నీటిని వదులుతున్నారన్న సమాచారం అందుకున్న రైతులు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన మిర్చి పంట తమకు దక్కకుండా పోతుందని పంటను ఒడ్డుకు చేర్చు కుంటూ అరగోస పడుతున్నారు.

సైబర్‌ మోసం …కేసు నమోదు

విశ్రాంత ఉద్యోగి బ్యాంకు ఖాతా నుండి తన ప్రమేయం లేకుండా నగదు బదిలీ అయిన ఘటన మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కళ్యాణ్‌నగర్‌లో నివాసముంటున్న సత్యనారాయణ మూర్తి బ్యాంకు ఖాతా నుండి 96వేలు బదిలీ అయినట్లు ఫోన్‌కు మెసేజ్‌ రాగా… వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు

అయోధ్యలో భక్తుల రద్దీ

అయోధ్య రామమందిరానికి భక్తులు పోటెత్తుతున్నారు. బాలరాముని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల తాడికి ఎక్కువగా ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

నుమాయిష్ లాస్ట్ డే

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో కొనసాగుతున్న నుమాయిష్‌ ఇవాళ్టి ముగియనుంది. శనివారం నాటికి సందర్శకుల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటింది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో దాదాపు 2 వేల 400 వరకు స్టాళ్లతో ప్రతి యేట జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తారు. ఈ సారి స్టాల్‌ హోల్డర్స్‌ విజ్ఞప్తి మేరకు నుమాయిష్‌ను మూడు రోజులు పెంచున్నారు. దీంతో నేటితో నుమాయిష్‌ ముగియనుంది.

Latest Articles

ఈ నెల 19న బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం

ఈ నెల 19వ తేదీన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత KCR నిర్ణయించారు. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్