25.2 C
Hyderabad
Friday, February 14, 2025
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

మేడారం జాతరలో హలాల్‌పై నిషేధం

మేడారం జాతరలో హలాల్‌ను నిషేధించినట్లు పేర్కొన్నారు ఆలయ ప్రధాన పూజారి సిద్దబోయిన అరుణ్‌. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు తరలివచ్చే భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లింపులో హలాల్‌ చేయోద్దని విజ్ఞప్తి చేసారు. ఆదివాసి సంప్రదాయాలను కాపాడి తల్లుల సేవలో తరించాలని కోరారు.

ఆధార్‌ ధృవీకరణపై ఉత్తర్వులు

గృహజ్యోతి పథకం అమలు ప్రక్రియలో భాగంగా లబ్దిదారులు తొలుతగా ఆధార్‌ ధృవీకరణ చేయించుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బయోమెట్రిక్‌ విధానంలో ధృవీకరణ పూర్తిచేస్తేనే పేర్లు నమోదు చేస్తామంటూ పేర్కొంది. ఈమేరకు డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధి పాతర్లపాడు వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో విజయవాడ వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరగ్గా సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

వచ్చేది మేమే అన్న టీడీపీ

విజయవాడ పార్లమెంట్‌, తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు కేశినేని చిన్ని, దేవదత్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. విస్సన్న పేట మండలం కొండగట్టు మల్లయ్య, కొండపర్వ ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీలో రానున్నది టీడీపీ, జనసేన ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేసారు కేశినేని చిన్ని.

జగన్‌ వెన్నులో వణుకు

సీఎం జగన్మోహన్‌రెడ్డి అరాచక పాలనకు ప్రత్యక్ష నిదర్శనం రాజధాని ఫైల్స్‌ చిత్రమన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురు మల రామకృష్ణ. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో రాజధాని ఫైల్స్ సినిమాపై స్పందించారు. రాజధాని ఫైల్స్‌ సిని మా ప్రస్తావిస్తే చాలు జగన్‌ వెన్నులో వణుకు పుడుతోందన్నారు.

చెల్లని రూపాయిలా జగన్ 

ఏపీ లోని 175 నియోజకవర్గాల్లో 7 రోజులపాటు ప్రజాపోరు యాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు బీజేపీ నేత విష్ణువ ర్ధన్‌రెడ్డి. ఈ యాత్రలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. ఉద్యోగుల బదిలీల మాదిరి వైసీపీ ఎమ్మెల్యే లు, ఎంపీలు, మంత్రుల్ని బదిలీ చేసి చెల్లని రూపాయిలా సీఎం జగన్‌ మారాడని ఎద్దేవ చేసారు.

రాజయ్యకు అభినందనలు

తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమీషన్‌ చైర్మన్ గా నియమితులైన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు అభినందనలు తెలి పారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ఆయనతోపాటు ఎమ్మెల్యేలు వివేక్‌ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా శుభాకాంక్షలు అందజేసారు. అసెంబ్లీ లోని మంత్రి కార్యాలయంలో వీరి భేటీ జరిగింది.

కండువా ఒక్కటే తక్కువ

ఏపీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు APCC అధ్యక్షురాలు వైఎస్‌. షర్మిల. పోలీసుల్ని కండువా లేని వైసీపీ కార్యకర్తలుగా పేర్కొన్నారు. సత్తెనపల్లిలో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఆమె ఖండించారు. ఈ మేరకు ట్వీట్‌ చేసారు. రాష్ట్ర డీజీపీ ఈ ఘటనపై స్పందించి, బాధ్యులైన పోలీసుల్ని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేసారు.

ప్రభుత్వ స్థలంపై కన్ను

హైదరాబాద్‌ బోరబండ ఫోర్‌ P J R గ్రౌండ్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంపై కన్నేసారు భూ కబ్జాదారులు. భూమిని అక్రమిం చుకునే క్రమంలో పునాదులు కట్టేందుకు సిద్దమవ్వడాన్ని గమనించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఉడాయించారు. స్ధలాన్ని అక్రమిస్తే క్రిమినల్‌ కేసులు తప్పవంటూ రెవిన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసారు.

కవచ్‌ ప్రయోగం సక్సెస్‌

రైలు ప్రమాదాల నివారణకై దేశీయంగా రూపొందించిన యాంటీ కొలిజన్‌ డివైస్‌ – కవచ్‌ను రైల్వే అధికారులు 8 బోగీలున్న వందేభారత్‌ రైలుపై పరీక్షించారు. తొలిసారిగా నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఈ రైలుకు కవచ్‌ వ్యవస్థ ఆటోమేటిక్‌గా బ్రేకులు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర, పాల్వాల్‌ మధ్య ఈ తాజా పరీక్ష జరిపింది రైల్వే శాఖ.

మరో రాకెట్‌ ప్రయోగం

తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట నుంచి సాయంత్రం GSLV-F14 రాకెట్‌ను ప్రయోగించనుంది ఇస్రో శాస్త్రవేత్తల బృందం. ఈ వాహకనౌక రెండు వేల 275 కిలోల బరువు గల ఇన్సాట్‌-3 DS ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. వాతా వరణ పరిశీలనల మెరుగుకై భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి దీన్ని రూపొందించారు.

నకిలీ నోట్ల ముఠా

కాకినాడ జిల్లా అన్నవరంలో జరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీలో నకిలీ కరెన్సీ వెలుగుచూసింది. దీంతో నలుగురు సభ్యుల దొంగనోట్ల ముఠాను అన్నవరం పోలీసులు అరెస్టు చేసారు. బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 20 లక్షల రూపాయల మేర టోకరా వేసే ప్రయత్నంలో వీరు పోలీసులకు చిక్కారు.

గంజాయి గ్యాంగ్‌

సిద్దిపేట జిల్లా ముస్త్యాల గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకుల్నిఅరెస్టు చేసి రిమాండ్‌కు తరలిం చారు చేర్యాల పోలీసులు. వీరి వద్ద నుండి 74 గ్రాముల గంజాయితోపాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకు న్నారు.

ఆటో బోల్తా – వ్యక్తి మృతి

ఆటో బోల్తా పడిన ఘటనలో చిన్న దానియేలు అనే 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. పల్నాడు జిల్లా మాచర్ల వెల్దుర్తి మండలం గుండ్ల పాడు వద్ద ఈ ఘటన జరిగింది. డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మ్యాచ్‌ నుండి వైదొలగిన అశ్విన్‌

రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న భాతర్‌ – ఇంగ్లాండ్‌ మూడో టెస్టు మ్యాచ్‌ నుండి బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వైదొలిగాడు. తల్లి అనారోగ్యం దృష్ట్యా అశ్విన్‌ మ్యాచ్‌ నుండి వైదొలగాలనే నిర్ణయం తీసుకున్నట్లు BC C I ఎక్స్‌లో వెల్లడించింది. జట్టు సభ్యులతోపాటు బిసీసీఐ అశ్విన్‌కు అండగా ఉంటుందని పేర్కొంది.

Latest Articles

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ కలకలం

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ విజృంభిస్తోంది. చికెన్‌, కోడిగుడ్లు తినాలా..వద్దా అని ప్రజలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బర్డ్‌ ఫ్లూతో కోళ్లు మృతి చెందుతుండడంతో కోళ్ల ఫారం యజమానులు ఆందోళన చెందుతున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్