లోక్‌సభ ఎన్నికల కోసం గులాబీ దళం వ్యూహాలు
లోక్‌సభ ఎన్నికల కోసం గులాబీ దళం కొత్త వ్యూహాలు పన్నుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపో వడంతో..పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీతో పొత్తు పెట్టుకునే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తుపై BRS ముఖ్య నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు సమాచారం. బీజేపీతో పొత్తు ఉంటే ఎలా ఉంటుందనే అంశంపై సీనియర్లతో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 17న ఇంకొల్లులో టీడీపీ ‘రా కదలి రా సభ’
బాపట్ల జిల్లా ఇంకొల్లులో ఈనెల 17వ తేదీన టీడీపీ రా కదిలి రా బహిరంగ సభను ఏర్పాటు చేశామని స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన భూమి పూజ చేసి ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని… వారంతా సభకు హాజరై జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కోరారు.
కొడాలి నానిని కలిసిన APSRTC జోనల్ చైర్మన్ పిన్నింటి మహేష్
గుడివాడలోని ఎమ్మెల్యే కొడాలి నానిని ఆయన నివాసంలో, APSRTC జోనల్ చైర్మన్ పిన్నింటి మహేష్ మర్యాద పూర్వకంగా కలిశారు. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి పనులపై, మహేష్‌తో కొడాలి నాని చర్చించారు. ప్రజా రవాణలో ఆర్టీసీ వ్యవస్థదే కీలక పాత్రని… ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలకు రవాణా సేవలు అందిస్తున్న, ఆర్టీసీ మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలని కొడాలి నాని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిందని చైర్మన్ మహేష్ అన్నారు.
సీఎం జగన్ చైర్ లో కూర్చున్న మంత్రి
సచివాలయం లో సీఎం జగన్ చైర్ లో కూర్చుని మంత్రి అమర్నాథ్ సమీక్ష చేయడంపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ట్వీట్ ద్వారా కామెంట్స్ చేసారు. పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు…పోటీకి సీటు ఇవ్వలేదని.. సెక్రటేరియట్ కు వెళ్లి ఏకంగా సీఎం సీట్లో కూర్చున్నాడు అంటూ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ అంటే కేవలం ఛైర్ కాదు…అదొక హోదా! అంటూ గుర్తు చేసారు. ఆ విషయం వీళ్లకు అర్థం కాదు….వీళ్ళ పోకడలకు అర్థం లేదంటూ ఫైర్ అయ్యారు
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో మార్పులు
జాతీయ చలనచిత్ర అవార్డులకు దేశంలో ఎంతో గుర్తింపు ఉంది. ఈ జాతీయ అవార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ దత్‌ల పేరు మీద ఉన్న అవార్డులకు వారి పేర్లను తొలగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటివరకు ఉత్తమ తొలి చిత్రం అవార్డును ఇందిరాగాంధీ పేరుతో… జాతీయ సమగ్రతపై వచ్చే చిత్రాల్లో ఉత్తమ చిత్రానికి నర్గీస్ దత్ పేరిట అవార్డు ఇచ్చేవారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలు స్తోంది.
కమలహాసన్ పార్టీకి టార్చిలైట్ చిహ్నం
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం పార్టీకి టార్చిలైట్ చిహ్నాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయిం చింది. నటుడు కమలహాసన్ నేతృత్వంలో MNM 2019 పార్లమెంటు ఎన్నికలు, 2021 శాసనసభ ఎన్నికల్లో టార్చిలైట్ చిహ్నంపై పోటీ చేసింది. ఈ నేపథ్యంలో, పార్లమెంటు ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలలో ఎంఎన్‌ఎం పార్టీకి ఎన్ని కల సంఘం, టార్చిలైట్ చిహ్నం కేటాయించాలంటూ కమల్ పార్టీ ఈసీకి విజ్ఞప్తి చేసింది. ఆ వినతిని ఈసీ పరిగణనలో కి తీసుకుంది.
బోరబండలో డబుల్ బెడ్ రూం ఇళ్ల రగడ
హైదరాబాద్‌లోని బోరబండలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం కమలానగర్ బస్తీ వాసులు ఆందోళనకు దిగారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడతామంటూ మహిళలు బెదిరించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇచ్చిన మాట తప్పారం టున్నారు. ఎమ్మెల్యే అనుచరులకు అనుకూలంగా ఉన్న వారికే ఇళ్లు ఇచ్చారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే రాకపోతే ఆత్మహత్యకు పాల్పడుతామని హెచ్చరించారు.
చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోడు భూముల పేరిట అటవీ ప్రాంతంలోని మొక్కలను స్థానిక గిరిజనులు, గ్రామస్తులు నరికివేస్తుండటంతో ఫారెస్ట్ అధికారులు అడ్డుకు న్నారు. భూమి లేని నిరుపేదలకు భూమి కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా.. స్థానిక అధికారులు పట్టిం చుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అటవీ ప్రాంతంలోని చెట్లను తొలగిస్తున్నామని చెబుతున్నారు. రెండు రోజుల్లో సర్వే నిర్వహిస్తామని అప్పటివరకు తమకు సహకరించాలని ఫారెస్ట్ అధికారులు కోరడం తో గిరిజనులు వెనక్కి తగ్గారు.
కార్గో డెలివరి సర్వీస్‌లో సిబ్బంది నిర్లక్ష్యం
విజయవాడ RTC బస్టాండ్‌లోని కార్గో డెలివరి సర్వీస్‌లో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. పార్సిల్ తీసుకోవడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుండడంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైన్‌లో నిల్చున్న తర్వాత సర్వర్‌లు పనిచేయలేదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి సిబ్బంది కస్టమర్లను వెనక్కు పంపిస్తున్నారు. ఆర్టీసీ కొరియర్‌ల కంటే ప్రైవేట్ కొరియర్లు ఉత్తమం అంటూ కస్టమర్లు వెనుదిరుగుతున్నారు.