31.2 C
Hyderabad
Sunday, March 3, 2024
spot_img

సంక్రాంతికి పల్లె బాటపట్టిన నగరం ….హైవేల్లో పెరిగిన ట్రాఫిక్ జాం

         సంక్రాంతి పండుగ సందర్భంగా నగరాల నుంచి ప్రజలు గ్రామాల బాట పట్టారు. కార్లు, సొంత వాహనాల్లో సొంతూ ళ్లకు పయనమయ్యారు. దీంతో హైవేలపై వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. సంక్రాంతి సందర్బంగా జాతీయ రహదారి -65పై హైదరాబాద్-విజయవాడ వైపు వాహనాల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో పంతంగి, కొర్లప హాడ్, మాడ్గులపల్లి వద్ద వాహనాలు నిలిచిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టోల్‌బూత్‌ల మధ్య ట్రాఫిక్‌ క్లియర్‌ కోసం టోల్‌ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అదనపు టోల్ బూత్‌లను ఏర్పాటు చేశారు. దీంతో, ట్రాఫిక్‌ కొంత మేరకు తగ్గింది.

        సంక్రాంతి సందర్బంగా హైదరాబాద్‌తోపాటు పలు రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ల్లో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. ప్రయా ణికులతో ప్లాట్‌ఫ్లామ్‌లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల నుంచి స్వస్థలాలకు ప్రయాణీకులు చేరుకుంటున్నారు. సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయింది. సంక్రాంతి పండగ సందర్భంగా పట్టణ ప్రజలు సొంత ఊళ్లకు బయలర్దేరుతున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రజలు స్వస్థలాలకు కార్లు, ఇతర వాహనాల్లో భారీ సంఖ్యలో తరలి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో పతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా రద్దీ నెలకొంది.

       సంక్రాంతి పండుగ వరస సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లె బాటపడుతున్నారు ప్రజలు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి వాహనాల రద్దీ క్రమ క్రమంగా పెరుగుతుంది. దీనికి తగ్గట్టుగా టోల్ ప్లాజా అధికారులు విజయవాడ వైపు ఎక్కువ టోల్ భూత్‌లను ఓపెన్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవులు ఉండడంతో వాహనాలపై మరింత పెరిగే అవకాశం ఉంది.

         తెలంగాణలోని పంతంగి, కొర్లపహాడ్‌, ఏపీలోని చిలకల్లు, కీసర టోల్‌ ప్లాజాల వద్ద తీవ్ర రద్దీ నెలకొని వాహనదా రులు చాలా సేపు వేచి చూడాల్సి వస్తోంది. టోల్‌ వసూలులో ఫాస్టాగ్‌ విధానం అమలులోకి రాక ముందు కొన్ని గంటల పాటు వేచి చూసే వారు. ప్రస్తుత విధానంతో వాహనదారులకు కొంత ఉపశమనం లభించినట్లే. శుక్రవారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు రావడంతో రద్దీ మొదలుకానుండగా.. శనివారం అధిక సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంక్రాంతికైనా వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చకా..చకా ముందుకు సాగేనా అని ప్రయాణికులు చూస్తున్నారు.

పంతంగి టోల్‌గేట్‌ వద్ద 16 టోల్‌ చెల్లింపు కేంద్రాలు ఉండగా.. మిగతా టోల్‌గేట్ల వద్ద 12 టోల్‌ చెల్లింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు మొదటి టోల్‌గేట్‌ పంతంగిదే వస్తుంది. ఇక్కడ టోల్‌ చెల్లించడానికి వాహనాలు ఎక్కువసేపు నిలుస్తున్నాయి. ఈ టోల్‌గేట్‌ దాటితే తర్వాత అంతలా రద్దీ ఉండదు. ఎందు కంటే నార్కట్‌పల్లి నుంచి కొన్ని వాహనాలు మిర్యాలగూడ మీదుగా అద్దంకి, చెన్నై వైపు వెళ్తాయి. కొర్లపహాడ్‌ టోల్‌గేట్‌ దాటాక మరికొన్ని వాహనాలు ఉమ్మడి ఖమ్మం వైపు, మిగతావి విజయవాడ వైపు బయలుదేరుతాయి. వాహనాలు ఇలా మూడు దారుల వైపు వెళ్తుండటంతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. తిరుగు సమయంలోను మూడు ప్రాంతాల వైపు నుంచి వచ్చే వాహనచోదకులు హైదరాబాద్‌కు వెళ్లాలంటే మరల పంతంగి టోల్‌గేట్‌ మీదుగానే వెళ్లాల్సి ఉంది. అందుకే ఇక్కడ వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది.

Latest Articles

అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు

      వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం పెట్టిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్