22.7 C
Hyderabad
Friday, March 1, 2024
spot_img

సంక్రాంతికి పల్లెబాట పడుతున్న సిటీ జనం !

సంక్రాంతి పండుగ దగ్గర పడటంతో పల్లెబాట పడుతున్నారు సిటీ జనం. ఈపాటికే చాలా మంది రైళ్లలో, బస్సుల్లో రిజర్వేషన్లు చేయించుకున్నారు. సంక్రాంతి….తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ. సూర్యుడు మకరరాశిలో ప్రవేశిం చిన రోజునే మకర సంక్రాంతి పండగ నిర్వహిస్తారు. సంక్రాంతి ఒక పర్వదినం. పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాము ఖ్యం ఉంది. ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కళకళలాడుతుంటాయి. గొబ్బి పాటలు, గంగిరెద్దులు, హ‌రిదాసులు, రథం ముగ్గులు, భోగిమంటలు, బొమ్మల కొలువులు, పిండి వంటలు, కొత్త దుస్తులు.. ఇలా తెలుగు రాష్ట్రాలు పండుగ శోభతో ఉట్టిపడుతుంటాయి.

భోగి భాగ్యాలు
సంక్రాంతి పండుగ తొలి రోజును భోగి అంటారు. రెండో రోజును మకర సంక్రాంతిగా అలాగే మూడో రోజును కనుమగా పిలు స్తారు. ఇక నాలుగో రోజును ముక్కనుమ అంటారు. సంక్రాంతి పండుగలో భోగి వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. భోగి మంటల్లో ఇంట్లోని పాత వస్తువులు, చెక్కలు, అవసరం లేనివి వేసి దహనం చేస్తారు. భోగి వేడుకల్లో సామాన్య ప్రజల తోపాటు సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. భోగి మంట చుట్టూ అందరూ చేరి నృత్యం చేస్తూ ఆనందిస్తుం టారు. పల్లెలతోపాటు పట్టణ ప్రాంతాల్లోనూ భోగి వేడుకల సందడిగా జరుపుకుంటారు. వాడవాడలా వేకువ జామునే భోగి మంటలు వేస్తారు. పాత సామాగ్రిని, పాత వస్తువులను భోగి మంటల్లో వేసి కాల్చి, పాతకు స్వస్తి చెప్తారు. కొత్తదనా నికి, క్రాంతికి స్వాగతం పలుకుతారు. భోగి వేడుకల్లో భాగంగా పిల్లలకు భోగి పళ్లు పోసి, ఎర్రనీళ్లతో దిష్టి తీస్తారు. ఇలా వేడుకను సంప్రదాయ బద్ధంగా నిర్వహించుకుంటారు. పల్లెల్లో రైతుల పొలాల నుండి ధాన్యం ఇళ్లకు చేరి లక్మీకళ వస్తుంది. ఈ విధంగా ఇంటింటా భోగి భాగ్యాలు సిద్ధిస్తాయి.

ఆకట్టుకునే సంక్రాంతి గొబ్బెమ్మలు
సంక్రాంతి రోజున ముగ్గులు వేసి రంగులతో అందంగా అలంకరించి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టడం ఆనవాయితీ. తెలుగు సంప్రదాయంలో గొబ్బెమ్మలకు ప్రత్యేకమైన స్థానం ఉంది.గొబ్బెమ్మను గౌరిమాతగా కొలుస్తారు. మరికొన్ని చోట్ల గొబ్బెమ్మను కాత్యాయినీ దేవిగానూ ఆరాధిస్తారు. పండగరోజు ముగ్గు వేసి.. ఆ ముగ్గులో గొబ్బెమ్మలను పెట్టి.. వాటిని పసుపు, కుంకుమ పూలతో అలంకరిస్తారు.పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెడుతుంటారు. కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు ఈ గొబ్బెమ్మలు ఒక సంకేతం. గొబ్బెమ్మలు అన్నీ ఒకేలా ఉండవు. కొన్ని చిన్నవిగా ఉంటే, మరికొన్ని పెద్దవిగా ఉంటాయి. అందులో పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా పూజిస్తారు. గోదాదేవి చుట్టూ ఆడపడుచులు తిరుగుతూ సందడి చేస్తారు. ముగ్గులు, గొబ్బెమ్మలు అంటే లక్ష్మీ దేవికి సైతం చాలా ఇష్టమని పెద్దలు అంటారు. అందుకే పండగ రోజున ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను పెడితే ఇంట్లోకి లక్ష్మీ దేవి ప్రవేశిస్తుందని విశ్వసిస్తుంటారు.సంక్రాంతికి అనేక ప్రత్యేకతలున్నాయి. వీటిలో రథం ముగ్గులు ఒకటి. రథం ముగ్గు సామాజిక ఐక్యతను సూచిస్తుంది. ఒక ఇంటి ముందు వేసే రథం ముగ్గు తాడును మరొక ఇంటి ముందు వేసిన రథం ముగ్గుతో కలుపుతారు. రథం ముగ్గులో ఇదే విశేషం.

సంక్రాంతి శోభతో కళకళలాడే తెలుగు పల్లెలు
పండుగకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలన్నీ సంక్రాంతి శోభతో ఉట్టిపడుతుంటాయి. ఈ పండుగకు వారం ముందు నుంచే సందడి కనిపిస్తోంది. వారం ముందు నుంచే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్న ప్రజలు సైతం పండగ సందడి కోసం పల్లెబాట పడుతుంటారు. పల్లెల నుంచి ఎదిగొచ్చిన ఎంతో మంది ఉద్యోగాల కోసం నగరాలు, పట్టణాల్లో సెటిల వుతుంటారు.మరికొంతమంది పెద్ద చదువుల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వస్తుంటారు. వీరంతా ఏడాది అంతా నగరాల్లోనే గడుపుతుంటారు. ఒక్క సంక్రాంతి పండుగకే మహా నగరాల నుంచి సొంతూళ్లకు పయనమవుతుం టారు. అది కూడా ఒంటరిగా కాదు….పిల్లా పాపలతో. పుట్టి పెరిగిన ఊళ్లో బంధుమిత్రుల మధ్య సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకోవాలని ఆరాట పడుతుంటారు.ఒకప్పుడు సంక్రాంతి శోభ కేవలం పల్లెల్లోనే కనిపించేది. పట్టణాలు, నగరాల్లో పండుగ వాతావరణం పెద్దగా కనిపించేది కాదు. అయితే కొంతకాలం నుంచి ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఫలితంగా హైదరాబాద్ లాంటి నగరాల్లోనూ సంక్రాంతి సందడి కనిపిస్తోంది. అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ ల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున సంక్రాంతి సంబురాలు చేసుకోవడం మొదలెట్టారు.

Latest Articles

పేర్ని నానికి కౌంటర్ ఇచ్చిన కొత్తపల్లి సుబ్బారాయుడు

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు వేదికగా..మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు కొత్తపల్లి సుబ్బారాయుడు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ, జనసేన సభ నిర్వహిస్తే నాని ఎందుకు ఆందోళన చేందుతున్నారని ఫైర్ అయ్యారు. ఆందోళన తగ్గాలంటే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్