22.7 C
Hyderabad
Sunday, March 3, 2024
spot_img

శ్రీరామునిలో ఉన్న 16 గుణాలు 

       అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను ప్రపంచమంతా వైభవోపేతంగా పండుగ చేసుకుంటోంది. భారతీయు లకు రాముడే ఆత్మ.. అంటే అతిశయోక్తి కాదు.. ప్రతి తండ్రి రాముడి లాంటి కొడుకు కావాలని కోరుకుంటాడు. అంతగా ప్రజల మనస్సుల్లో నిలిచి పోయిన గొప్ప వ్యక్తిత్వం గలవాడు కాబట్టే ..రాముడు దేముడు అయ్యాడు. ప్రపంచానికే ఆద ర్శం అయ్యాడు.

      రాముడు సకల గుణాభిరాముడు… దశరథ రాముడు.. కోదండ రాముడు.. జానకి రాముడు.. ప్రజలందరికీ ఆదర్శ ప్రాయుడు శ్రీరాముడు. “రామో విగ్రహవాన్ ధర్మః” అన్నది ఆర్యోక్తి.. అంటే.. రాముడు మూర్తీభవించిన ధర్మ స్వరూపం. అంటే.. రూపం ధరించిన ధర్మం అని అర్థం. సకల గుణాభిరాముడి గుణాలను అందరూ అలవరచుకోవాలని అని మహర్షి వాల్మీకి అభిలషించాడు. అందుకే . రాముని దారి అనే అర్థంలో తన కావ్యానికి రామాయణం అనే పేరుని స్థిరపరిచారు వాల్మీకి మహర్షి.రామాయణం ఆదికావ్యం అంటారు. భవిష్యత్ దర్శించగల సష్ట్ర అయిన వాల్మీకి.. ముందు యుగాల ప్రజలు అందరికీ ధర్మ బోధన చేసే దృష్టితో రామాయణంలోని ధర్మాలపై ప్రత్యేకమైన దృష్టి నిలిపి రచించారు. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం రామావతారం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ఈ ప్రపంచంలో అన్నీ మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు? అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్నవేసినప్పుడు ‘పదహారు గుణాలు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రాముడని నిర్ధారించి నట్లు రామాయణం చెబుతుంది.

    సామాన్య మానవుడి జీవితంతో శ్రీరాముడి జీవితం మమేకమైపోయింది. ఆయన మానవుడిగా పుట్టాడు.. మానవుడిగా పెరిగాడు. తండ్రి ఇచ్చిన మాట నిలిపేందుకు రాజ్యాన్ని, చక్రవర్తి పదవినీ త్యజించాడు. కష్టాలను పడ్డాడు. ఎన్నికష్టాలు వచ్చినా ధర్మ మార్గాన్ని మాత్రం విడువలేదు. శరణన్నవారిని రక్షించాడు. తన బల, పరాక్రమములతో శత్రువులను గెలిచాడు. రాజుగా ఆదర్శవంతమైన పాలన అందించాడు. అందుకే సుపరి పాలనను రామరాజ్యం అంటారు.. అంతటి సకలగుణాలు కలిగిన మానవుడు కాబట్టే.. దైవంగా కొలుస్తారు.

    రామాయణం ప్రారంభంలో వాల్మీకికి నారదుడు రాముడిలోని 16 విశిష్ఠ గుణాలను వివరించారు. అవి 1. గుణవం తుడు, 2. వీర్యవంతుడు, 3. ధర్మాత్ముడు, 4. కృతజ్ఞతాభావం కలిగినవాడు, 5. సత్యం పలికేవాడు, 6. దృఢమైన సంక ల్పం కలిగినవాడు, 7. చారిత్రము కలిగినవాడు, 8. అన్ని ప్రాణుల హితవు కోరేవాడు, 9. విద్యావంతుడు, 10. సమర్థుడు, 11. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించేంతటి సౌందర్యవంతుడు, 12. ధైర్యవంతుడు, 13. క్రోధాన్ని జయిం చినవాడు, 14. తేజస్సు కలిగినవాడు, 15. ఎదుటివారిలో మంచిని చూసేవాడు. 16. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు. భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలో అన్ని దేశాలలో, అన్నిభాషలలో రామాయణం చొచ్చుకు పోయింది. ఇండోనేషియా వంటి ఇస్లామిక్ దేశం రామాయణానికి పెద్ద పీట వేసింది. ఆ దేశ సంస్కృతిలో రామాయణం ఓ భాగమైంది. ప్రపంచ ప్రజలంతా మతాలతో నిమిత్తం లేకుండా ప్రపంచ ప్రజలంతా రాముడి గుణగణాలను కీర్తిస్తు న్నారు కాబట్టే.. నేడు అయోధ్యలో రామ ప్రాణ ప్రతిష్ఠ ప్రపంచ పండుగ అయింది.

Latest Articles

పాలమూరు – రంగారెడ్డిపై కాంగ్రెస్ ఆరోపణలు

   దక్షిణ తెలంగాణ వరదాయనిగా పేరొందిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌ కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కరువుసీమగా పేరున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటిని పారించే ప్రధాన లక్ష్యంతో ప్రారంభించిన పాలమూరు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్