30.2 C
Hyderabad
Friday, March 1, 2024
spot_img

లోక్ సభ ఎన్నికలకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ

        తెలంగాణలో కాంగ్రెస్ సర్కారుకు పాలన మీద పూర్తి పట్టు రాకముందే పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఇటు పాలనపైన దృష్టి పెడుతూనే, అటు జిల్లాల పర్యటన సాగించడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలి సింది. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించి అధిష్టానానికి బహుమానంగా ఇవ్వాలని సీఎం పట్టుదలగా ఉన్నట్టు సమాచారం.

       రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుకు పాలన మీద పూర్తి పట్టు రాకముందే.. సీఎం రేవంత్ రెడ్డి కి పార్లమెంట్ ఎన్నికలు సవాల్ గా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన నేపథ్యంలో అధిష్టానం కు పార్లమెంట్ ఎన్నికల్లో అత్య ధిక స్థానాలు సాధించి బహుమానంగా ఇవ్వాలని సీఎం పట్టుదలగా ఉన్నారు. దీనిలో భాగంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక వైపు పాలనను దూకుడుగా ముందుకు తీసుకువెళ్తూనే, మరో వైపు పార్లమెంట్ ఎన్నికలకు అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు. గాంధీ భవన్ వేదికగా పార్లమెంట్ ఎన్నికల ఎజెండాను రాష్ట్ర నాయకత్వానికి దిశ నిర్దేశం చేస్తున్నారు. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపే దిశగా అడుగులు వేస్తున్నారు. ముమ్మరంగా ప్రచార వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సమీక్షలు నిర్వహించడమే కాకుండా, మంత్రులను, ముఖ్య నేతలను ఇంచార్జిలుగా నియమించారు.

        కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ మీద ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా బూత్ స్థాయి ఏజెంట్ లకు దిశ నిర్దేశం చేసేందుకు పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ లీడర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచ్చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సభా వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి ఖర్గే పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ శ్రేణులు గ్రామీణ బాట పట్టాలని ఖర్గే తెలిపారు. పల్లె ప్రాంతాల్లో నేతలు, కార్యకర్తలు పర్యటిస్తే.. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మరింత చేరువ అవుతుందని ఆయన తెలిపారు.

        కాంగ్రెస్ సర్కారు ఏర్పడి కనీసం 50 రోజులు సైతం పూర్తికాకుండానే బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి గులాబీ పార్టీ నేతలపై మండిపడ్డారు. ఏళ్లకు ఏళ్లు పాలించి రాష్ట్రాన్ని దివాళా తీయించిన బీఆర్ఎ స్ ఓటమిపాలైనా తీరు మార్చుకోవడం లేదని విమర్శించారు. అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం చెందారు. పాలన మీద పూర్తి దృష్టి సాధిస్తే, ప్రతిపక్షాలు విమర్శలపర్వానికి తెరలేపి, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని చూస్తున్నాయని సీఎం అన్నారు. బీఆర్ఎస్ ఆటలేం సాగవని, ఆ పార్టీ నేతలు ఎన్ని జిమ్మిక్స్ చేసినా ప్రజలు విశ్వసించరని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లను బీఆర్ఎస్ కు అపజయం తప్పదని సీఎం అన్నారు. ఇప్పటి నుంచి అసలు ఆట మొదలవుతుందని, వారంలో మూడు రోజులు పాలనపైన దృష్టి సారించి, మరో మూడు రోజులు పార్టీ కార్యకర్తలతో మమేకం అవుతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందుకే, జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. పీసీసీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇంద్రవెల్లి సభ మంచి మైలేజ్ తీసుకు వచ్చింది. ఇంద్రవెల్లి సభ ను సెంటిమెంట్ గా భావిస్తూ.. అక్కడ నుంచే పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూర్తిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు.

        పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ సరిహద్దుల వరకు తరిమికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పేద ప్రజలకు పథకాలను సత్వరం అందించడానికి పలు చర్యలు తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో విజయబావుటా ఎగుర వేయాలని బీఆర్ఎస్ ఉవ్వి ళూరుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుని, కార్యకర్తలకు పెద్దపీట వేసి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని గులాబీ బాస్ భావిస్తున్నట్టు సమాచారం.

Latest Articles

ఛలో పాలమూరు కాంగ్రెస్ పిలుపు

    బీఆర్ఎస్ చలో మేడిగడ్డకు కౌంటర్‌గా చలో పాలమూరు, రంగారెడ్డికి పిలుపునిచ్చింది అధికార కాంగ్రెస్. CWC మెంబర్‌ వంశీచంద్‌రెడ్డి సారధ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేల్లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్