24.7 C
Hyderabad
Wednesday, February 28, 2024
spot_img

లోక్‌సభ ఎన్నికల్లో 4 వందల సీట్లను టార్గెట్‌గా పెట్టుకున్న ఎన్డీయే

       2019 ఎన్నికల తరువాత అనేక ప్రాంతీయ పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాయి. శిరోమణి అకాలీదళ్‌, అన్నాడీఎంకే, తెలుగుదేశం పార్టీ సహా మరికొన్ని పక్షాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త మిత్రుల కోసం అన్వేషణ మొదలుపెట్టింది ఎన్డీయే కూటమి. కర్ణాటక రాజకీయాల్లో కొంతకాలంగా దూరంగా ఉంటున్న జనతాదళ్‌ సెక్యులర్ పార్టీ ఇటీవల బీజేపీకి మళ్లీ దగ్గరైంది. ఇదిలా ఉంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బలంగా ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్ ఎన్డీయే కూటమి దిశగా అడుగులు వేస్తోంది.

       ప్రధాని నరేంద్ర మోడీ- కేంద్రమంత్రి అమిత్ షా ద్వయానికి ప్రతి ఎన్నిక ఒక యుద్ధమే. అవి మునిసిపల్ ఎన్నికలు కావచ్చు..శాసనసభ ఎన్నికలు కావచ్చు. అంతిమంగా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతారు బీజేపీ అగ్రనేతలు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అన్ని ఆయుధాలతో సన్నద్ధమవుతోంది. ఈసారి ఎలాగైనా 400 సీట్లను గెలుచుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది ఎన్డీయే కూటమి. ఈ నేపథ్యంలో కొత్త మిత్రుల కోసం బీజేపీ అన్వేషణలో పడింది. 2019 తరువాత ఎన్డీయే కూటమి నుంచి అనేక రాజకీయ పార్టీలు వైదొలగాయి. పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, తమిళనాడులో అన్నా డీఎంకే సహా మరికొన్ని పార్టీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడానికి ఎవరి కారణాలు వారికు న్నాయి.

         హిందీ బెల్ట్‌లో బీజేపీ ఇప్పటికీ దూకుడుమీదనే ఉంది. అయితే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిన కమలం పార్టీ బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణాదిపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. దక్షిణాదిన ఉన్న ఐదు రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. కాగా సౌతిం డియాలోని ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ అధికా రంలో లేదు. సింపుల్‌గా చెప్పాలంటే కమలం పార్టీకి దక్షిణ భారతదేశం కొరకరానికొయ్యగా మారింది. కర్ణాటక రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీకి గేట్‌ వే ఆఫ్ సౌతిండియాగా పేర్కొనవచ్చు. కమలం పార్టీ దక్షిణాదిన తొలిసారి అధికారంలోకి వచ్చింది కర్ణాటక లోనే. 2006లోనే మిత్రపక్షాలతో కలిసి కన్నడ నేలపై బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో కర్ణాటకలో కమలం పార్టీకి బ‌ల‌మైన క్యాడర్‌ త‌యారైంది. ఈ క్రెడిట్ క‌చ్చితంగా బీజేపీ సీనియర్ నేత బీఎస్ య‌డ్యూర‌ప్పదే. కర్ణాటకలో బీజేపీకి ప‌క్కాగా పునాదులు వేసిన నాయకుడు య‌డ్యూరప్ప. కర్ణాటకలో య‌డ్యూర‌ప్ప నాయ కత్వ ప్రతిభ, లింగాయ‌త్ సామాజిక‌వ‌ర్గం అండ‌దండ‌ల వ‌ల్లే బీజేపీ బ‌ల‌మైన పార్టీగా అవ‌త‌రిం చింది.

        దక్షిణాదినగల ఐదు రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటకలోనే బీజేపీ బలంగా ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ ఒంటరిపోరు చేసింది. అయితే ఇటీవల బీజేపీతో కలిసి ప్రయాణం చేయడానికి దేవెగౌడ నాయకత్వంలోని జనతాదళ్ సెక్యులర్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో గౌరవించదగ్గ రీతిలో సీట్లు వస్తాయని కమలనాథులు భావిస్తున్నారు. అయితే ఒక్క కర్ణాటక మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎద‌గ‌క‌పోవ‌డానికి అక్కడి రాజ‌కీయ ప‌రిస్థితులే కార‌ణం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు…ఈ మూడు రాష్ట్రాల్లోనూ బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీలున్నాయి. కొన్ని ప్రత్యేక ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. జాతీయ పార్టీల వైఫ‌ల్యాలే దక్షిణాదిన బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీలు పుట్టుక‌కు కార‌ణమయ్యాయి. 2014 నాటి విభ‌జ‌న తరువాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేకుండా పోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాజ‌కీయాల‌ను తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శాసించ‌డం మొద‌లైంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో కమలం పార్టీ ఉనికి నామమాత్రమే. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బ‌ల‌ప‌డాలంటే ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకో వాల్సిందే. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన కూటమితో భారతీయ జనతా పార్టీ కలిసి నడుస్తుం దన్న ఊహాగానాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఆవిర్బవించింది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణలో బీజేపీ ఉన్నా, ఆ పార్టీ ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితంగా ఉంది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు నియోజకవర్గా లను బీజేపీ గెలుచుకుంది. కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ ఎనిమిది సీట్లు గెలుచు కుంది. త‌మిళ‌నాడు రాష్ట్రంలో మొద‌టి నుంచి ద్రవిడ పార్టీల‌దే హ‌వా. నిన్నమొన్నటివరకు ఎన్డీయే కూటమిలో అన్నా డీఎంకే భాగస్వామ్యపక్షంగా ఉండేది. అయితే కొన్ని నెలల కిందట ఎన్డీయే కూటమి నుంచి అన్నా డీఎంకే వైదొలగిం ది. ఈనేపథ్యం లో అన్నాడీఎంకే చీలికవర్గం నేత అయిన పన్నీర్ సెల్వం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నా యన్న వార్తలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. మొత్తానికి కొత్త మిత్రుల అన్వేషణ లోనూ ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది.

Latest Articles

ప్రతి భారతీయుడికి కనెక్ట్ అయ్యే సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’: వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్