23.7 C
Hyderabad
Sunday, February 25, 2024
spot_img

రాముడు వసుధైక కుటుంబానికి సమాధానం – ప్రధాని మోదీ

       

  సప్త మోక్షపురాల్లో అయోధ్య ఒకటి. అలాంటి పవిత్రమైన అయోధ్యాపురికి తల వంచి నమస్కరిస్తున్నా….ప్రపంచ వ్యాప్తంగా రామ భక్తులంతా ఆధ్యాత్మిక ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. వాస్తవానికి ఈ నేలపై మన పూర్వీకులు ఎన్నో బలిదానాలు, పోరాటాలు, త్యాగాలు చేశారు.ఈ నేపథ్యంలో ఇన్నాళ్లకు మళ్లీ అయోధ్యకు రాముడు వచ్చాడు. ఈ శుభముహూర్తంలో ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా అంటూ ప్రసంగించారు… మోదీ. ఈ అద్వితీయమైన కార్యక్రమం ఆలస్యం అయినందుకు రాముడిని క్షమించమని వేడుకుంటున్నా… జనవరి 22- 2024 చూడడానికి ఇది కేవలం తేదీ మాత్రమే కాదు. ఇది దేశంలో సరికొత్త అధ్యాయానికి ప్రతీక. ఈ తేదీకి, శుభఘడియలకు ఎతో పరిపూర్ణ దివ్యత్వం ఉంది. కాలచక్రంలో శతాబ్దాలు గడిచినా ఈ తేదీని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. ఈ మహిమాన్విత క్షణం కోసం అయోధ్య ప్రజలు శతాబ్దాలుగా నిరీక్షించారు. స్వాతంత్ర్యం అనంతరం కూడా దశాబ్దాలపాటు న్యాయపోరాటం చేశాం. ఇన్నేళ్లకు మన స్వప్నం సాకారమైంది. శ్రీరాముడి ఆశీస్సులతో ఈ అద్భుత ఘట్టంలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి జరుపుకుంటున్నారు. ఈ రోజు రాత్రి ప్రతి ఇంటిలోనూ రాత్రికిజ్యోతి వెలగాలి అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

    అయోధ్యలో రామమందిర్ నిర్మాణానికి అడుగడుగునా ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి. కానీ , చివరకు న్యాయమే గెలి చిందని, ప్రధాని మోదీ బాలరామ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా చెప్పారు. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థకు కృతజ్ఞ తలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ అద్వితీయమైన, అద్భుతమైన శుభ ఘడియల కోసం దాదాపు 11 రోజులుగా దీక్ష వహించానని, రాముడితో అనుబంధం ఉన్న క్షేత్రాలన్నీ సందర్శించానని, ఆంధ్రప్రదేశ్ లో లేపాక్షి ఆలయం, తమిళ నాడులోని రామేశ్వరం ఆలయాన్ని దర్శించుకున్నానని, సాగర్ నుంచి సరయూ వరకు రామనామం జపించుకు న్నానని, ఈ క్షణం దేశ ప్రజలుసహనం పరిపక్వతకు నిదర్శనం అన్నారు. ఇది విజయానికే కాదు వినయానికి కూడా సూచిక అన్నారు. కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్ధం చేసుకోలేకపోయారు. రామనామం ఈ దేశ ప్రజల
కంకణంలో నిండి ఉంది. మన దేశ సంస్కృతి , కట్టుబాట్లకు రాముడి ఆదర్శ జీవనమే ప్రధానమని , రాముడి ఆదర్శం , విలువలు , క్రమశిక్షణ మనకు శిరోధార్యం అన్నారు. అయోధ్యలో జరిగింది కేవలం విగ్రహ ప్రాణప్రతిష్ఠ కాదు. మన విశ్వాసాలకు ప్రాణ ప్రతిష్ఠ. రాముడు వివాదం కాదు ….సమాధానం …అన్నారు మోదీ. రాముడి జీవతం భారత దేశం ఆధారం. వాస్తవానికి ‘రాముడి విధానమే భారత్ విధానం’ అని రాముడి ఆదర్శ జీవనాన్ని కొనియాడారు.

       యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ ప్రసంగిస్తూ… ఐదు వందల ఏళ్ల కల నెరవేరింది. అనుకున్న చోటే రామాల యం నిర్మించాం అని అన్నారు. దశాబ్దాల పోరాటం తర్వాత ఈ అద్భుత, అనిర్వచనీయమైన ఘట్టం సాధ్యపడిందని తెలి పారు. ఈ ఆనందాన్ని తాను మాటల్లో వర్ణించలేనిదని చెప్పారు. బాల రామయ్య ప్రతిష్ఠతో దేశమంతా రామమయంగా మారిందన్నారు. ఇక్కడి వాతావరణం చూస్తుంటే త్రేతాయుగంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అయోధ్య ప్రపంచ సాంస్కృ తిక రాజధానిగా వర్ధిల్లుతుంది అన్నారు. అంతేకాదు ప్రధాని మోదీ దూరదృష్టి , అంకిత భావంతోనే ఇది సాధ్యమైంద న్నారు. ఈ ప్రాణ ప్రతిష్ట వేడుకను వీక్షించిన ప్రజలు అదృష్టవంతులని అన్నారు. ఈ అద్వితీయమైన ఘట్టంలో భాగ స్వాములైన అందరికీ ధన్యవాదాలంటూ ఆనందం వ్యక్తం చేశారు .

Latest Articles

డైరెక్టర్ వీఎన్ ఆదిత్యకు అమెరికా యూనివర్సిటీ డాక్టరేట్

"మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు వీఎన్ ఆదిత్య. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్