ఏపీలో ఎన్నికల వేళ అమరావతి రాజధాని అంశంపై తెరకెక్కిన రాజధాని ఫైల్స్ చిత్రానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రం విడుదల నిలిపేయాలని కోరుతూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇవాళ విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. రేపు మరోసారి ఈ పిటిషన్ పై విచారణ జరిపి హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. ఏపీలో అమరావతి స్ధానంలో వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తూ స్ధానిక రైతులు ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగువన్ వెబ్ సైట్ కు చెందిన నిర్మాణ సంస్ధ ఈ పోరాటాన్ని రాజధాని ఫైల్స్ పేరుతో తెరకెక్కించింది.