మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై తాజాగా మరో కేసు నమోదయింది. మూడు రోజుల క్రితం కావలి నియోజకవర్గం బోగోలు మండలానికి చెందిన శ్రీనివాసులు రెడ్డిపై జరిగిన దాడి ఘటనలో పోలీసులపై కాకాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులను బెదిరించే ధోరణిలో కాకాని కామెంట్స్ చేశారంటూ వన్ టౌన్ పోలీసులకు టిడిపి నేత ఒంటేరు ప్రసన్న ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత ఇచ్చిన పిర్యాదుతో 224, 351/2, 352, 353/2 సెక్షన్ల కింద కాకానిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
అసలు ఏం జరిగిందంటే..
బోగోల మండలం కోళ్లదిన్నె గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డిపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ శ్రీనివాసరెడ్డిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్థానిక మాజీ శాసనసభ్యులు రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కలిసి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోలీసుల అండదండలతో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని.. పోలీసులు తెలుగుదేశం నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కాకాని ఆరోపించారు. ఈ విషయంపై కాకానిపై నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు