26.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

బ్రిటన్ గడ్డపై భారతీయ వారసుడు రిషి సునాక్ విజయాలు

      రిషి సునాక్…భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి. 43 ఏళ్ల రిషి సునాక్ బ్రిటన్ రాజకీయా ల్లో ఓ సంచల నం. రెండేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. బ్రిటన్ రాజకీయా ల్లో ఓ రికార్డు సృష్టించారు రిషి సునాక్. వాస్తవానికి రిషి సునాక్ పూర్వీకులది పంజాబ్. రిషి సునాక్ 1980 మే 12న ఇంగ్లాండ్ లోని సౌథాంప్టన్ లో జన్మించారు. రిషి పూర్వీకులు మొదట తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లారు. అక్కడి నుంచి పిల్లలతో సహా యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. సునాక్ తండ్రి యశ్‌వీర్ కెన్యాలో జన్మించారు. తల్లి ఉష, టాంజానియాలో జన్మించారు. యశ్‌వీర్, ఉష కుటుం బాలు బ్రిటన్ వెళ్లాక ఇద్దరికీ వివాహం జరిగింది.

     రిషి సునాక్  స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చేశారు. తొలుత కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు. కాలిఫోర్ని యాలో చదువుతున్న రోజుల్లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు అక్షతా తో పరిచయమైంది. ఆ తరువాత పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. రిషి చదువుకునే రోజుల్లోనే కన్సర్వేటివ్ పార్టీ లో కొంతకాలం ఇంటర్ననల్‌షిప్‌ చేశారు. ఆ తరువాత 2014లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2015 సాధారణ ఎన్నికల్లో రిచ్‌మండ్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచా రు. ఆ తరువాత మరోసారి జరిగిన ఎన్నికల్లో కూడా రిషి గెలిచారు. 2019 లో కన్సర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ కు రిషి మద్దతు ఇచ్చారు. దీంతో బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధాని అయ్యారు. బోరిస్ జాన్సన్‌ ప్రధాని అయ్యాక ఆర్థిక మంత్రిత్వ శాఖలో రిషికి చీఫ్ సెక్రెటరీ పోస్టు ఇచ్చారు. బోరిస్ జాన్సన్ కు అత్యంత నమ్మకస్తుడిగా రిషికి పేరుంది. తనదైన డైనమిజంతో రైజింగ్ స్టార్ మినిస్టర్‌గా రిషి సునాక్ పొలిటి కల్ సర్కిల్స్‌లో పేరు తెచ్చుకున్నారు. రిషి పనితీరుకు మెచ్చి,2020 ఫిబ్రవరిలో ఛాన్సలర్ గా ప్రమోషన్ కల్పించారు. క్యాబినెట్ లో పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా అప్పుడే రిషి చేరారు. 2020 మార్చి లో రిషి సునాక్ పార్లమెంటులో తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇదిలాఉంటే, పార్లమెంటులో ఎంపీగా రిషి, భగవద్గీత పై ప్రమాణం చేశారు. బ్రిటన్ పార్లమెంటరీ చరిత్రలో ఇదో విశేషం.

     కరోనా విజృంభించిన సమయంలో ఫైనాన్స్ మినిస్టర్‌గా రిషి సునాక్ తన సమర్థత చాటుకున్నారు. కరోనా టైమ్ లో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేలా బిలియన్ పౌండ్ల విలువ చేసే అత్యవసర పథకాలను ఆర్థిక మంత్రి హోదాలో రిషి సునాక్ ప్రకటించారు. అలాగే వ్యాపారులు, ఉద్యోగుల కోసం కూడా అనేక ఆకర్షణీయ పథకాలు, ఉద్దీపనలు ఆయన ప్రవేశపెట్టారు . రిషి సునాక్‌ తన పనితీరుతో బ్రిటన్ ప్రజల్లో గుడ్‌ విల్ తెచ్చుకున్నారు. యావత్ బ్రిటన్‌లో రిషి సునాక్ పాపులర్ అయ్యారు. అంతేకాదు…ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే, కరోనా సమయంలో బోరిస్ జాన్సన్ తన సహచరులతో కలిసి పార్టీలు చేసుకున్నారు. ఈ సంగతి విమర్శలకు దారితీసింది. జాన్సన్‌ పార్టీలు బ్రిటన్ రాజకీయాలను కుదిపేశాయి. దీంతో బోరిస్ జాన్సన్ దిగిపోతే ఎవరన్న ప్రశ్న తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే రిషి సునాక్ పేరు తెర పైకి వచ్చింది. ఆ తరువాత బ్రిటన్ రాజకీయాల్లో అనేక కీలక పరిణా మాలు సంభవించాయి. చివరకు 2022 అక్టోబరు 25న బ్రిటన్ 57వ ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు స్వీకరించారు. రిషి సునాక్‌కు మరో రికార్డు ఉంది. తొలిసారి ఎంపీ అయిన తరువాత బ్రిటన్ ఆధునిక చరిత్రలో అత్యంత వేగంగా ప్రధాని పదవిని అందుకున్నది కూడా రిషినే. కేవలం ఏడేళ్ళ రాజకీయ జీవితంలో రిషి సునాక్ ప్రధాని పదవి వరకు ఎదిగారు. మొత్తానికి భారతీయుల గౌరవం పెంచారు రిషి సునాక్.

Latest Articles

తెలంగాణ గడ్డపై త్రిముఖ పోరులో గెలుపు ఎవరిది ?

    తెలంగాణలో నువ్వా నేనా అన్న రేంజ్‌లో పార్లమెంట్ ఫైట్‌ నడుస్తోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే గెలుపు మాదంటే మాదని ఢంకా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్