Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

బీటలు వారుతున్న ఇండియా కూటమి

          రాహుల్ గాంధీ పాదయాత్ర వేళ ఇండియా కూటమి బీటలు వారింది. కూటమిలోని విభేదాలు ఒక్కటొక్కటిగా దండలో పూసల్లా రాలిపోతున్నాయి. ఇండియా అలయన్స్ లో భాగస్వామ్యపక్షాల మధ్య ఐక్యత లోపించిందని ఇటీ వల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో స్పష్టంగా తేలిపోయింది. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు లేదని తృణమూల్ కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ తెగేసి చెప్పాయి. సమాజ్‌వాదీ పార్టీ కూడా అదే టర్న్ తీసుకుంది. బీజేపీ ని ఓడించడానికి ఏకమైన ప్రతిపక్షాల కూటమి ఒకతాటిపై ఉండలేకపోయింది. ఇండియా కూటమికి ప్రధాన కర్త అయిన నితీశ్ తప్పుకోవడంతో కూటమి డొల్లతనం బయట పడిపోయింది. కాంగ్రెస్ అధినేతల పెత్తందారీ పోకడలే ఇందుకు కారణమా ?

         రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అధికార బీజేపీకి దీటుగా పోటీ ఇచ్చే లక్ష్యంతో ఏర్పడిన ఇండియా అలయన్స్ కు నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ నిష్క్రమణ పెద్దదెబ్బగా మరిణమించింది. ఇండియా అలయన్స్ లో సీట్ల సర్దుబాటు విషయంలో ఒక పక్క మల్లగుల్లాలు పడుతున్న వేళ ప్రాంతీయ శక్తులైన తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో విభేదాలు నెలకొన్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూటమితో నిమిత్తం లేకుండా తమ రాష్ట్రంలో అన్ని స్థానాల్లోనూ తామే పోటీ చేస్తామని ప్రకటించారు. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర సీఎం ప్రకటించారు. ఇప్పుడు కూటమిలో అతిపెద్దపక్షమైన జేడీయూ బీజేపీ వైపు వెళ్లిపోవడంతో కూటమికి పెద్ద విఘాతం ఏర్పడింది. ఇండియా కూటమి వ్యవహారం ఆదిలోనే హంసపాదు చందంగా మారింది. అయినా ఇండియా కూటమిలో కాంగ్రెస్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటిస్తుంది.రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలు రాబట్టుకోవడం కోసం కూటమి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళతారనేది కోటిడాలర్ల ప్రశ్నగా మిగిలింది.

     బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్య సంఘటన ఏర్పాటుకు మొదట శ్రీకారం చుట్టింది జేడీయూ అధినేత నితిశ్ కుమారే. 2023 జూన్ 23 న పాట్నాలో 18 ప్రతిపక్ష పార్టీలతో మొదటి సమావేశాన్ని నితిశ్ కుమార్ ఏర్పాటు చేశారు. దేశంలో ఎడముఖం పెడముఖంగా ఉన్న ప్రతిపక్షాలను ఒక్క తాటిపై తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఇండియా అలయన్స్ రెండవ సమావేశం 2023 జూలై 17-18 తేదీలలో బెంగళూరులో జరిగింది. ఆ నాటికి కూటమిలో చేరిన ప్రతిపక్ష పార్టీల సంఖ్య 28కి చేరింది. ఆ తర్వాత మళ్లీ ఆగస్టు 31-సెప్టెంబర్ 1న ముంబైలో కీలక సమావేశం జరిగింది. ఈ అన్ని సమావేశాలలోనూ జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితిశ్ కుమార్ కీలక పాత్ర వహించారు.

         ఒక దశలో ఇండియా అలయన్స్ వర్గాల్లో ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్ అన్న టాక్ విన్పించింది. కూటమి కన్వీ నర్ గా నితిశ్ కుమార్ ను నియమిస్తారని కూడా భావించారు. అయితే ఇండియా కూటమిలో కాంగ్రెస్ అధిష్టానం పెద్ద న్న ధోరణితో వ్యవహరించడంపై నితీశ్ కినుక వహించారు. అలయన్స్ చైర్మన్ గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమితులు కావడంతో విభేదాలు పెచ్చుపెరిగాయి. కినుక కాస్తా అలకగా మారింది.ఆ దశలో కన్వీనర్ గా ఉండేందు కు నితిశ్ తిరస్కరించారు. దీంతో కూటమి మరింత బీటలు వారింది. 2024 పార్లమెంటు ఎన్నికలకోసం ఇండియా అలయన్స్ పూర్తి స్థాయిలో సన్నద్ధమయే దశలోనే… కూటమిలో కీలక పార్టీలు ఒకటొకటిగా దూరమవుతున్నాయి. తామే 300 సీట్లకు పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో ఆ పార్టీ పెద్దన్న ధోరణి అనుసరించడంపై మొదట తృణమూల్, తర్వాత ఆప్, ఇప్పుడు బీహార్ లో జేడీయూ దూరమయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు 11 సీట్లే ఇస్తామని సమాజ్ వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్ మాటలూ అతడి ధోరణిని తెలియజేశాయి.

        నితీశ్ నిష్క్రమణ వల్ల ఇండియా కూటమికి వచ్చిన నష్టం ఏదీ లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రామ్ రమేశ్ వ్యాఖ్యానించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో నితీశ్ కు, ఢిల్లీలో అధికార బీజేపీ పార్టీకీ బీహార్ ప్రజలు సరైన సమాధానం చెబుతారన్నారు. నితిశ్ కుమార్ లాంటి అవకాశవాద నాయకుడిని తాను చూడలేదని జైరాంరమేశ్ పేర్కొన్నారు. అత ను ఊసరవెల్లికి గట్టి పోటీ ఇవ్వగలడు. ఈ మొత్తం డ్రామాను ప్రధాని మోదీ నడిపిస్తున్నారని దుమ్మెత్తి పోశారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర విజయవంతం కావడంతో మోదీ అవాక్కయ్యారని జైరాం రమేశ్ అభిప్రాయపడ్డారు. కూటమి మూడు సమావేశాల్లో నితీష్ కుమార్ ప్రముఖ పాత్ర పోషించారని జైరాం రమేశ్ అన్నారు. అందుకే చివరి వరకు బీజే పీని, దాని భావజాలాన్ని ఎదుర్కోవాలని నితీశ్ కుమార్ ను భావించారని తాము నమ్మామని జైరాం రమేశ్ చెప్పారు.

         ఇటీవల చత్తీస్‌గఢ్‌,రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి తరువాత నితీశ్ కుమార్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇండియా కూటమి వ్యవహారాల్లో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించడాన్ని ఆయన అసలు సహించలేకపోయారు. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం పెట్టిన శ్రద్ధ, ఇండియా కూటమిని బలోపేతం చేయడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టలేదని నితీశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో కూటమి ఏర్పాటు విష యంలో మొదటినుంచి చొరవ చూపిన తనకు కూటమి సమన్వయకర్త పదవి లభిస్తుందని నితీశ్ కుమార్ ఆశపడ్డార ట. అయితే నితీశ్ ఆశ నెరవేరలేదు. దీంతో నితీశ్ హర్ట్ అయ్యారని చెబుతారు. ఆ తరువాత జరిగిన అనేక పరిణామా ల్లో తనకు ప్రాధాన్యం తగ్గిందని నితీశ్ బాధపడ్డారట. ఇండియా కూటమి తరపున తనను కాకుండా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించడం కూడా నితీశ్‌ను నచ్చలేదంటారు.

         దేశ రాజకీయాలను మలుపు తిప్పే గుండెకాయలాంటి హిందీ బెల్ట్‌లో పట్టు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి, బీజేపీని ఢీకొట్టేంతటి సామర్థ్యం లేదని నితీశ్ కుమార్ ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీయే కూటమి వైపు నితీశ్ అడుగులు వేశారు. వాస్తవానికి నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయానికి నితీశ్ అంటే పెద్దగా పడదంటారు రాజకీయ పరిశీలకులు. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. పైపెచ్చు బీహార్‌ లోని బలమైన సామాజికవర్గమైన కుర్మీల్లో నితీశ్ కుమార్‌కు బాగా పట్టుంది. దీంతో 400 సీట్ల లక్ష్య సాధనలో భాగంగా నితీశ్ కుమార్‌కు బీజేపీ అగ్ర నాయకత్వం స్వాగతం పలికిందని జాతీయ రాజకీయాల్లో సర్వత్రా వినిపిస్తున్న మాట. 2024 లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ దూసుకెళ్తున్న తరుణంలో బీహార్ పరిణామాలు కూటమికి పెద్దషాక్ .. ఇప్పటి కైనా, కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలకు స్వస్తి చెప్పి, వాస్తవిక దృక్పథం తో, సామరస్యపూర్వకంగా అన్నిపక్షాలనూ కలుపుకుని వెళ్తే ప్రతిపక్ష కూటమికి గౌరవం దక్కుతుందని జాతీయ రాజకీ య విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్టీఏ కూటమి దెబ్బకు ఇండియా కూటమి చతికిల పడితే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కేంద్రంలో మళ్లీ కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమేనని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్