Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

బీజేపీకి మచ్చలా మారిన సంజయ్ సింగ్ ఉదంతం

        ప్రజాస్వామ్యయుగంలో భారతీయ జనతా పార్టీ కనీస సంప్రదాయాలను పాటించడం లేదన్న ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. ఇందుకు అనేక సంఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్‌ సింగ్ ఉదంతం తెరమీదకు వచ్చింది. సంజయ్‌ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత. ఇటీ వల ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ అగ్ర నాయకత్వం. దేవుడు వరమిచ్చినా, పూజారి వరం ఇవ్వలేదన్న నానుడి ఇక్కడ చెప్పుకుని తీరాలి. సంజయ్‌ సింగ్‌ను ఆయన పార్టీ పెద్దల సభకు నామినేట్ చేసినా, ప్రమాణస్వీకారం చేయడానికి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ అనుమతి ఇవ్వలేదు. సంజయ్ సింగ్ ప్రమాణస్వీకారికి నో చెప్పారు జగదీప్ ధన్కడ్. దీనికి ఆయన చెప్పిన కారణం సంజయ్‌ సింగ్‌ కేసు సభా హక్కుల పరిశీలనలో ఉండ టమే.

       సంజయ్‌ సింగ్‌పై గతంలో మనీలాండరింగ్ కేసు నమోదైంది. మనీలాండరింగ్ కేసులో సంజయ్ సింగ్‌ను కిందటి ఏడాది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అరెస్ట్ చేసింది. ఢిల్లీ సర్కార్ మద్యం పాలసీకి సంబం ధించి సంజయ్‌ సింగ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జనవరిలో ఢిల్లీ నుంచి సంజయ్ సింగ్‌ను మరోసారి రాజ్యసభకు నామినేట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనాయకత్వం. ఇదిలాఉంటే, ఈనెల ఐదో తేదీన పార్లమెంటుకు వెళ్లి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సంజయ్ సింగ్‌కు గతవారం ఢిల్లీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. పోలీసు కస్టడీలో ఉన్న సంజయ్ సింగ్‌ను ఉదయం 10 గంటలకల్లా పార్లమెంటుకు తీసుకెళ్లి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను స్పెషల్ జడ్జి ఎంకె నాగపాల్ ఆదేశించారు. అయితే కోర్టు ఆదేశాలమేరకు సంజయ్‌ సింగ్‌ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయడానికి పార్లమెంటుకు వచ్చారు. అయితే ఆయనపై ఉన్న మనీలాండరింగ్ కేసు సభాహక్కుల కమిటీ పరిశీలనలో ఉన్న విషయాన్ని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రస్తావించారు. సభా హక్కుల కమిటీ నివేదిక ఇచ్చేంతవరకు సంజయ్‌ సింగ్ ప్రమాణస్వీకారానికి తాను అనుమతి ఇవ్వలేనని జగదీప్ ధన్కడ్ స్పష్టం చేశారు.

     ఇదిలా ఉంటే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ వ్యవహారాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పుపడుతున్నారు. మనీలాం డరింగ్‌ కేసుకు, సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయడానికి సంబంధమే లేదన్నారు. సభా హక్కుల కమిటీ నివేదిక వచ్చేంతవరకు సంజయ్‌ సింగ్‌ ప్రమాణస్వీకారానికి అనుమతి ఇచ్చేది లేదనడం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడమే అని మండిపడుతున్నారు. జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ భిన్న ధృవాలు. బీజేపీ హిందూత్వ అజెండాతో ముందుకుపోతుంటే, అభివృద్ధిని కీలకాంశంగా చేసుకోని జాతీయ రాజకీయాల్లో దూసుకు వెళుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకే దేశ రాజ‌కీయాల్లో ఒక సంచ‌ల‌నం. అవినీతిర‌హిత రాజ‌కీయాలే సిద్ధాంతాలుగా ఇండియ‌న్ రెవిన్యూ స‌ర్వీస్ మాజీ అధికారి అర‌వింద్ కేజ్రీవాల్ 2012 లో ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు.

       ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం చాలా ఎక్కువ. అయితే ఒకవైపు బీజేపీ హవా, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాను తట్టుకుంటూ ఢిల్లీ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేశారు ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. బీజేపీని ఢీ కొట్టి ముచ్చ‌ట‌గా మూడోసారి ఢిల్లీ ముఖ్య‌మంత్రి అయ్యారు. ఢిల్లీతో పాటు పొరుగు నఉన్న పంజాబ్‌ను కూడా కార్యక్షేత్రం చేసుకుని జనంలోకి వెళ్లింది ఆమ్ ఆద్మీ పార్టీ. పంజాబ్‌లోనూ పాగా వేసింది. 2021 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. అంతేకా దు కిందటిఏడాది ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా లభించింది. ఏమైనా సంజయ్ సింగ్ ఎపిసోడ్‌ భారతీయ జనతా పార్టీకి మచ్చలా మారిందంటున్నారు ప్రజాస్వామ్య వాదులు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్