Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

బిజెపి – టిడిపి పొత్తులో జగన్ చిచ్చు?

     జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యం ఏంటి.? రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం హస్తిన పెద్దలను కలుస్తున్నారా? రాష్ట్ర రాజకీయాలు ఢిల్లీ పెద్దల భేటీలో చర్చకు వస్తాయా.? టీడీపీ, బీజేపీ పొత్తులో జగన్ చిచ్చుపెట్టే అవకాశం ఉందా? బిజెపి – టిడిపి వైపు వెళ్లకుండా నిలువరించేందుకే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారా! రాష్ట్రంలో పొత్తులకు సంబంధించి సీఎం జగన్ ఢిల్లీ పెద్దలకు ఏం చెప్పబోతున్నారు.?

ఏపీకి చెందిన ముఖ్యనేతలంతా వరుసగా ఢిల్లీ బాటపడుతున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిషాతో సమావేశమయ్యారు. జన సేన అధినేత పవన్ కూడా ఢిల్లీ వెళ్తారు అంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు, ఇతర విభజన హామీలు అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారు. మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికల జరగనున్నటువంటి నేపథ్యంలో కేంద్ర పెద్దలతో జరిగిన భేటీలో రాష్ట్రంలోని రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల పోత్తులు, రాజకీయ అంశాలపై కేంద్ర పెద్దలతో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించినట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి.

      ఏపీలో ఇప్పటికే టిడిపి జనసేన ఎన్నికల పత్తు ఖరారైంది. మరోవైపు బిజెపితో కలిసి పనిచేసేందుకు టిడిపి తో పాటు జనసేన ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇప్పటికే బీజేపీ, జన సేన పొత్తులో వున్నాయి. ఈ నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి అమిత్ శాని కలవటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అమీత్ షా, చంద్రబాబు భేటీ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కలిసి కూటమిగా పోటీ చేస్తాయని ప్రచారం ముమ్మురంగా జరుగుతుంది. ఇలాంటి కీలక తరుణంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళటం పొలిటికల్ గా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2019లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బిజెపి కోటమీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు ప్రభుత్వాల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. రాజ్యసభ లోను, లోక్సభలోను అంశాల వారీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ,బిజెపి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తోంది. నిన్న మొన్నటి వరకు టిడిపి అధినేత చంద్రబాబుని ఇటు వైసిపి అటు బిజెపి రాజకీయ శత్రువుగా భావించాయి. కానీ తాజాగా బిజెపి ఏపీలో టిడిపి తో పొత్తుకు సిద్ధమవుతూ ఉండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. బిజెపి టిడిపి కలిసి పోటీ చేస్తే మైనారిటీ, క్రిస్టియన్ ఓట్లు వైసిపి వైపు వుంటాయంటు ఇంతకాలం ఆ పార్టీ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ టిడిపి బీజేపీ మధ్య పోత్తుల అంశం తెరపైకి రావడంతో ఒక్కసారిగా వైసిపి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే ఉన్నపళంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలుస్తున్నారని చర్చ జరుగుతుంది.

       2014 ఎన్నికల్లో బిజెపి, టిడిపి ,జనసేన ఎన్నికల పొత్తు పెట్టుకున్నాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. దీంతో టిడిపి జనసేన బిజెపి కూటమి అధికారంలోకి రాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 67 ఎమ్మెల్యే స్థానాలతో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. అదే 2019 ఎన్నికల నాటికి టిడిపి ,జనసేన , బిజెపి విడివిడిగా పోటీ చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 ఎమ్మెల్యే సీట్లతో తిరుగులేని మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది. రానున్న ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ, బీజేపీ ,జనసేన కలిసి కూటమిగా వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవని చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. వైసిపి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి రావడం కల్లా అంటూ ఒకవైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు మళ్లీ అధికారం తమదే అంటూ వైసిపి పైకి ధీమాగా కనిపిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం ఆందోళన చెందు తున్నట్టు తెలుస్తోంది.అందులో భాగంగానే భారీ ఎత్తున ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు చేస్తున్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి కీలక పరిస్థితుల్లో టిడిపి, బిజెపి, జనసేన పొత్తు పెట్టుకుంటే అది కచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే అంశంగానే వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. బిజెపి ,టిడిపి పొత్తుకి ఆదిలోనే చెక్ పెట్టెందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని ప్రచారం వైసిపి వర్గాల్లో జరుగుతోంది. కేంద్రానికి వైసీపీ అన్ని విధాలుగా సహకరిస్తుందని… ఎన్నికల తర్వాత కూడా వైసీపీ సహకరించేందుకు సిద్ధంగా ఉందని …..ఇలాంటి తరుణంలో టిడిపి తో పొత్తు పెట్టుకోవడం వల్ల బిజెపికి ప్రయోజనం లేదనే అంశాన్ని ఆ పార్టీ పెద్దల ముందు సీఎం జగన్ ఉంచినట్టు తెలుస్తోంది. ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో అటు టిడిపి, బిజెపికి స్నేహస్తం అందిస్తుంది .మరోవైపు సీఎం జగన్ కూడా తమ స్నేహాన్ని కొనసాగిస్తామని చెప్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో బిజెపి, టిడిపితో పొత్తు పెట్టుకుంటుందా లేదంటే జగన్కు సహకరిస్తుందా అనేది ఆసక్తిగా మారింది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్