28.2 C
Hyderabad
Saturday, March 2, 2024
spot_img

బంగ్లాదేశ్ నుండి అక్రమంగా ప్రవేశించిన యువతి …. వ్యభిచార దందా

         సమాజంలో రాను రానూ డబ్బుంటే చాలు … అనుకునే మనుషులు పెరిగిపోతున్నారు.ఈ నేపథ్యంలోనే ఒక యువతి మనీ మైండ్ తో ఆలోచించింది. మనీ ఎర్న్ కు ఏమార్గమైనా పర్వాలేదని భావించి, ఓ బంగ్లాదేశ్ యువతి అక్రమ మార్గంలో హైదరాబాద్ కు చేరుకుంది. ముందుగా బంగ్లాదేశ్ నుండి కోల్ కత్తాకు చేరుకొని అక్కడి నుండి సికింద్రాబాద్‌కి రైలు ద్వారా చేరుకొని అపై తనకు యాప్ ద్వారా పరిచయమైన దంపతుల ఇంట్లో ఉంటూ వ్యభిచారం చేస్తోంది. తాజాగా ఓ విటుడు దగ్గరికి ఆ దంపతులకు చెప్పకుండా వెళ్తుండడంతో దారిమధ్యనే బంగ్లాదేశీ యువతితో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో ఆ యువతీ 100కు కాల్ చెయ్యడంతో వ్యభిచార దందా బయటపడింది.

       బంగ్లాదేశ్ మహిళ అక్రమ మార్గంలో సుమారు రెండు నెలల కిందట భారత్‌లోకి అడుగుపెట్టింది. కోల్‌కతా నుంచి సికింద్రాబాద్‌కు రైల్లో వచ్చి అక్కడి నుంచి తనకు జాబ్‌ ఆఫర్‌ ఇచ్చిన పాతబస్తీ చాంద్రాయణ గుట్టలో నివసించే దంప తుల వద్దకు చేరింది. పాతబస్తీ చాంద్రాయణగుట్ట ఘాజిమిల్లత్‌కాలనీలో షేక్‌ సోనియా, మహ్మద్‌ సల్మాన్‌ దంపతులు నివసిస్తున్నారు. బట్టల దుకాణంలో పనిచేసే మహ్మద్‌ సల్మాన్‌.. షేక్‌ సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ, భారత్‌కు చెందిన వ్యక్తికి పుట్టిన సంతానం. దీంతో కోల్‌కతా నగరంతో షేక్‌ సోనియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశస్థులు పరస్పరం మాట్లాడుకో వడానికి ప్రత్యేకంగా ఒక యాప్‌ ఉంది. ఇలా యాప్‌లో షేక్‌ సోనియా చాటింగ్‌ చేస్తుండగా బంగ్లాదేశ్‌ వొర్సిండి మండ లం రాయ్‌పూర్‌ గ్రామానికి చెందిన స్రిప్టీ అక్తర్‌ పరిచయమైంది. వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో హైదరాబాద్‌లో తనకు డబ్బు సంపాదించేం దుకు ఉద్యోగం దొరుకుతుందా అని స్రిస్టీ అక్తర్‌ అడిగింది. ఇళ్లలో పనిచేసే ఉద్యోగమైతే నెలకు 10 వేల రూపాయలు వస్తాయని, వ్యభిచార వృత్తిలోకి వస్తే నెలకు 20 వేల రూపాయలు వస్తాయని షేక్‌ సోనియా చెప్పింది. డబ్బు కోసం తాను ఏపనైనా చేస్తానని స్రిస్టీ అక్తర్‌ వెల్లడించింది. భారత్‌లోకి ఎలా ప్రవేశించాలని అడగ్గా…ఆ రిస్కు నీవే తీసుకోవాలి. ఒక వేళ ఇక్కడికి వస్తే తనకు ఫోన్‌ చేయాలని చరవాణి నంబరు ఇచ్చింది.

      రెండు నెలల క్రితం స్రిస్టీ అక్తర్‌ బంగ్లాదేశ్‌ సరిహద్దులు దాటి అక్రమ మార్గంలో కోల్‌కతాకు చేరింది. అక్కడి నుంచి రైలులో నేరుగా సికింద్రాబాద్‌కు వచ్చి షేక్‌ సోనియాకు ఫోన్‌ చేసింది. దంపతులు వెళ్లి యువతిని చాంద్రాయణగుట్ట లోని తమ ఇంటికి తీసుకొచ్చారు. ఆమెతో వ్యభిచారం చేయించడం మొదలు పెట్టారు. స్వయంగా షేక్‌ సోనియా వెంటవెళ్లి స్రిస్టీ అక్తర్‌ను తిరిగి తీసుకొచ్చేది. సోనియా చరవాణి ఆ సమయంలో స్రిస్టీ అక్తర్‌ వద్ద ఉండేది. శుక్రవారం షేక్‌ సోనియా పక్కింట్లోకి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఆమె చరవాణికి కాల్‌ రాగా స్రిస్టీ అక్తర్‌ మాట్లాడింది. అత్తాపూర్‌ లోని పిల్లర్‌ నంబరు 150 వద్దకు రావాలని సదరు వ్యక్తి చెప్పడంతో ఆమె ఆటో ఎక్కి అక్కడికి వెళ్లింది. ఇంటికి వచ్చిన షేక్‌ సోనియా తన చరవాణి అక్కడే పడి ఉండడం, స్రిస్టీ అక్తర్‌ కనిపించకపోవడంతో అనుమానప డింది. ఆఖరులో వచ్చిన నంబరుకు కాల్‌చేయగా అత్తాపూర్‌కు వస్తోందని తెలిసింది. వెంటనే దంపతులు వెంబడించగా అత్తాపూర్‌లో స్రిస్టీ అక్తర్‌ కనిపించింది. తమకు చెప్పకుండా ఎందుకు వచ్చావని అడగడంతో వారి మధ్య గొడవ జరిగింది. సోనియా చేతిలోని చరవాణి లాక్కొని యువతి డయల్‌ 100 చేయగా అసలు బండారం బయటపడింది.

         బంగ్లాదేశ్ యువతీ ఫోన్ కాల్ తో స్పాట్ కు చేరుకున్న అత్తాపూర్‌ ఏఎస్సై మహ్మద్‌ బుర్హానుద్దీన్‌, మహిళా సిబ్బందితో అక్కడికి వచ్చారు. అసలు విషయం తెలుసుకొని చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు దంపతులతోపాటు యువతి స్రిస్టీ అక్తర్ పై కేసులు నమోదు చేసి వివరాలు రాబట్టి ముగ్గురిని రిమాండ్ కు తరలించారు. పోలిసుల విచారణలో బంగ్లాదేశ్ యువతీ స్రిస్టీ అక్తర్‌కు బంగ్లాదేశ్‌లో భర్త ఆసిఫ్‌ఖాన్‌, ఇద్దరు సంతానం ఉన్నట్లు వెల్లడైంది. ఆసిఫ్‌ఖాన్‌ మేస్త్రీ పనిచేయడంతో డబ్బు సరిపోక ఆమె అక్రమ మార్గంలో దేశ సరిహద్దులు దాటి వ్యభిచార వృత్తిలోకి చేరింది. ఇలా గతంలో కూడా బంగ్లాదేశ్ యువతులకు ఉద్యోగాల పేరిట హైదరాబాద్ కు రప్పించి వ్యభిచారం చేయించిన ఘటనలు బయటకి వచ్చాయి. హైదరాబాద్ నగర పోలీసులు వ్యభిచార ముఠాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Latest Articles

పాలమూరు – రంగారెడ్డిపై కాంగ్రెస్ ఆరోపణలు

   దక్షిణ తెలంగాణ వరదాయనిగా పేరొందిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌ కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కరువుసీమగా పేరున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటిని పారించే ప్రధాన లక్ష్యంతో ప్రారంభించిన పాలమూరు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్