భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్14 ప్రయోగించనుంది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ నిన్న మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 27.30 గంటలపాటు కొనసాగిన తర్వాత షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్14 దూసుకెళ్లనుంది. ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ అర్ధరాత్రి షార్కు చేరుకుని, కౌంట్‌డౌన్ ప్రక్రియను పర్యవేక్షిస్తూ.. శాస్త్రవేత్తలకు, సూచన లు చేశారు. జీఎస్ఎల్వీ వాహకనౌక 2 వేల 275 కిలోల బరువు గల ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. ఈ ఉపగ్రహాన్ని వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవే క్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుప రుస్తుంది. ప్రస్తుతం కక్ష్యలోని ఇన్సాట్-3డీ, ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహాలతో కలిసి పనిచేయ నుంది.


