22.7 C
Hyderabad
Friday, March 1, 2024
spot_img

తీగ లాగితే కదిలిన దొంగ పాస్‌పోర్టుల డొంక

         అయ్య బాబోయ్…అన్ని నకిలీ పత్రాలా…అమ్మ నాయనో.. ఇన్ని పాస్ పోర్టులా…ఓర్నాయినో వీళ్లు మామూలోళ్లు కాదు…ఇప్పడు భాగ్యనగరమంతా ఇదే చర్చలు. ఒకరు కాదు, ఇద్దరు కాదు…ఏకంగా 92 మంది నకిలీ పత్రాలతో పాస్ పోర్టులు సంపాదించి విదేశీయానం సాగించారు. దశాబ్దకాలం క్రితం ఇలాంటి ఘటనే చోటు చేసుకోగా… ఇప్పుడు తిరిగి రిపీట్ అయ్యింది.

      పాస్ పోర్ట్ తీసుకోవాలంటే ఎన్నో రూల్స్, రెగ్యూలేషన్లను అనుసరించాలి. ఒరిజన్ సర్టిఫికెట్లు చూపించాలి, ఎంక్వైరీ ఎదుర్కోవాలి. అంతా కరెక్ట్ గా వుందని పాస్ పోర్ట్ అధికారులు ధృవీకరించుకున్నాకే పాస్ పోర్ట్ జారీ చేస్తారు. అలాంటి ది, ఒకరు కాదు, ఇద్దరు కాదు 92 మంది నకిలీ పత్రాలతో పాస్ పోర్టులు సంపాదించి విదేశాలకు చెక్కేశారంటే.. ఈ మోసగాళ్లను గుండెలు తీసిన బంటులు అనుకోవాలా లేక వీళ్ల వెనకాల ఎవరైనా పెద్ద తలకాయలు, అదృశ్య శక్తులు ఉన్నాయని భావించాలో తెలియడం లేదు. తీగ లాగితే పాస్‌పోర్టుల డొంకంతా కదులుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్లతో పాటు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్లలో చోటు చేసుకున్న ఈ పాస్ పోర్టు రాకెట్ లో ఇంకా ఎందరు వున్నారో CID దర్యాప్తులో వెల్లడికావల్సి వుంది. దశాబ్దకాలం క్రితం ఈ తరహా ఘటన జరిగింది. ఇప్పుడు మళ్లీ రీపిట్ అయ్యింది.

       ఈ నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో ఇప్పటికే 12 మంది నిందితులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆరు జిల్లాల పాస్‌పోర్ట్ బ్రోకర్‌ని సీఐడీ అరెస్ట్ చేసింది.  కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్‌పోర్ట్ లు పొందినట్లు గుర్తించారు. కొందరు విదేశీయులకు సైతం నకిలీ పాస్‌పోర్ట్ లు ఇప్పించి నట్టు అధికారులు గుర్తించారు. ఈ దందాకు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు సహకరించారని వార్తలు వెలువడ్డాయి. దీంతో, ఈ అంశాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. నాంపల్లికి చెందిన అబ్దుల్‌ సత్తార్‌ ఒస్మాన్‌ అల్‌ జవహరీ రాకెట్‌కు ప్రధాన సూత్రధారి అని తెలిసింది. నాంపల్లి కి చెందిన సత్తార్ డీటీపీ గ్రాఫిక్స్‌లో సిద్ధహస్తుడు. ఈ పనితోపాటు పాస్‌పోర్టు బ్రోకర్‌గా పని చేయడం మొదలెట్టాడు. విద్యార్హతలు, ఆధార్, పాన్‌కార్డు ఇలా అన్నిరకాల కీలక డాక్యుమెం ట్లు, నకిలీవి తయారు చేస్తూ గల్ఫ్‌ ఏజెంట్ల సర్కిల్‌లో బాగా పాపులర్‌ అయ్యాడు. వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్‌ ప్రాంతాల్లోని బ్రోకర్లకు పాస్‌పోర్ట్‌లకు కావాల్సిన సర్టిఫికెట్లు సమకూర్చేవాడు.

       విద్యార్హత, ధృవీకరణ పత్రం, ఆధార్, పాన్‌ ఏది కావాలన్నాఅబ్దుల్‌ సత్తార్‌ నిమిషాల్లో రెడీ చేసేస్తాడు . కొందరు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు సైతం ఈ నకిలీ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నారు. దీంతో, ఈ మోసగాళ్ల పని మరిం త సులువైంది. నకిలీ పాస్‌పోర్టులు ఇప్పించి విదేశీయులను భారతీయులుగా దేశం దాటించగలిగారు. వీరు ఇప్పిం చిన పాస్‌పోర్టుల్లో అత్యధిక పాస్‌పోర్టులకు ఒకే ఆధార్, ఒకే ఫోన్‌ నంబరు ఉండటంతో విషయం బట్టబయలైంది. ఇమిగ్రేషన్‌లో దొరికిపోకుండా తనిఖీలు అవసరం లేని ఈసీఎన్‌ఆర్‌, ఇమిగ్రేషన్‌ చెక్‌ నాట్‌ రిక్వైర్డ్‌ కేటగిరీలోనే నింది తుడు పాస్‌పోర్టులు ఇప్పించారు. ఇందుకు వారి నుంచి లక్షల రూపాయల్లో వసూలు చేశారు. చాలా పాస్‌పోర్టులకు ఒకే ఆధార్‌ కార్డు ఉండటం, కస్టమర్లందరికీ ఏజెంట్లు తమ ఫోన్‌ నంబరునే అటాచ్‌ చేసి ఉంచడం గమనార్హం.

రాకెట్‌ సూత్రధారి అబ్దుల్‌ సత్తార్‌ తన నెట్‌వర్క్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాడు. అబ్దుల్‌ సత్తార్‌ ఉస్మాన్‌ అల్‌ జవ హరీ నాంపల్లికి చెందినవాడు కాగా.. మహ్మద్‌ ఖమ్రుద్దీన్, చాంద్‌ఖాన్, దేశోపంతుల అశోక్‌ రావు, పెద్దూరి శ్రీనివాస్‌, గుండేటి ప్రభాకర్‌, పోచంపల్లి దేవరాజ్‌, అబ్దుల్‌ షుకూర్‌ లు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. నిందితులు ఎంతమందికి నకిలీ సర్టిఫికెట్లు ఇప్పించారు..? ఎంతమంది విదేశీయులకు పాస్‌పోర్టులు ఇప్పించారు..? అన్న విషయంపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు.

      ఇక్కడి చిరునామాలతో పలువురు కెనడా, మలేసియా, దుబాయ్, గల్ఫ్‌ దేశాలు, స్పెయిన్, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, ఇరాక్‌ తదితర దేశాలకు వెళ్లినట్టు గుర్తించారు. వారంతా అక్కడ ఏం చేస్తున్నారు..? ఏ ఏ కంపెనీల్లో పనిచేస్తున్నారు..? అన్న విషయాన్ని కనిపెట్టే పనిలో పోలీసులు నిమగ్నమ య్యారు. డబుల్‌ పాస్‌పోర్ట్‌లు, వాటికి అవసరమైన నకిలీ ధ్రువీకరణ పత్రాలను నిందితులు తయారు చేస్తున్నారన్న ఆరోపణలు 2014లో వచ్చాయి. అప్పుడు… కోరుట్లకు చెందిన ఖమరోద్దీన్, అశోక్‌రావు, చాంద్‌పాషాపై కేసులు నమోదయ్యాయి. అనంతరం కొంతకాలం ఇక్కడ ఎలాంటి కార్యకలా పాలు జరగలేదు. తాజాగా సీఐడీ అధికారుల దాడులతో వీరంతా పాస్‌పోర్ట్‌ దందా ఆపలేదని రుజువైంది. ఏదేమైనా ఈ తరహా ఘరానా నేరాలపై సర్కారు పాలకులు, ఉన్నతాధి కారులు, పోలీసులు ఉదాశీన వైఖరి అవలంభించరాదని… నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరు తున్నారు. తిరిగి ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.

Latest Articles

పేర్ని నానికి కౌంటర్ ఇచ్చిన కొత్తపల్లి సుబ్బారాయుడు

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు వేదికగా..మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు కొత్తపల్లి సుబ్బారాయుడు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ, జనసేన సభ నిర్వహిస్తే నాని ఎందుకు ఆందోళన చేందుతున్నారని ఫైర్ అయ్యారు. ఆందోళన తగ్గాలంటే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్