32.2 C
Hyderabad
Tuesday, March 18, 2025
spot_img

జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు

     జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై క్రిమినల్‌ కేసు నమోదైంది. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్‌ కేసు పెట్టింది. విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం 499, 500, ఐపీసీ సెక్షన్ల కింద పవన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసి నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. పవన్‌ కల్యాణ్‌ మార్చి 25న విచారణకు హాజరుకావాలని నాలుగో అదనపు జిల్లా కోర్టు నోటీసులిచ్చింది.

     గతేడాది జులై 9న ఏలూరులో వారాహి యాత్రలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఈ కేసు పెట్టింది. వాలం టీర్లపై పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యాయని ప్రభుత్వం పిటిష న్‌లో పేర్కొంది. పవన్ వ్యాఖ్యలు వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీ యడమే కాకుండా ప్రభుత్వంపైనా బురదజల్లేలా ఉన్నాయని ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. పవన్‌ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ బి.పవన్‌ కుమార్‌తో పాటు కొందరు వాలంటీర్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పవన్‌పై కేసు దాఖలు చేస్తున్నట్లు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్‌ కల్యాణ్‌పై చర్యలు చేపట్టేందు కు గతేడాది జులై 20న రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది.గతేడాది జులై 9న ఏలూరులో వారాహి యాత్రలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి సమాచా రం సేకరిస్తున్నారని, ఒంటరి మహిళలను కనిపెట్టి కొందరు సంఘ విద్రోహశక్తుల ద్వారా వల పన్ని కిడ్నాప్ చేస్తున్నారని పవన్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంలో కొంతమంది వైసీపీ పెద్దల పాత్ర ఉందని కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పాయ ని పవన్‌ పేర్కొన్నారు. ఇక కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో సుమారు 29 వేల నుంచి 30 వేల మంది అమ్మాయిలు కనిపించ కుండా పోయారని ఆరోపించారు. అదృశ్యమైన వారిలో 14 వేలమంది తిరిగి వచ్చారని పోలీసులు చెబు తున్నా రని, మిగిలినవారి గురించి సీఎం ఎందుకు ప్రశ్నించడం లేదని, డీజీపీ కనీసం ఎందుకు స్పందిం చడం లేదని ప్రశ్నించారు.

Latest Articles

‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి ‘వచ్చార్రోయ్’ పాట విడుదల

బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్