Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

చింతమనేనికి నో టికెట్ అన్న టీడీపీ ?

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి చింతపట్టుకుంది. చింతమనేని ప్రభాకర్‌కు ఈసారి టీడీపీ టిక్కెట్టు ఉంటుందా లేదా అన్నదే దెందులూరు నియోజకవర్గంలో చర్చ. దెందులూరు నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ మధ్య చింతమనేని ప్రభాకర్ ప్రభ తగ్గడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది.

దెందులూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైన చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు. అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ ఒక మాస్ లీడర్‌గా పేరు తెచ్చుకొని పార్టీలో పట్టు సాధించారు. అయితే ఇదంతా గతం. గత ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్ అనూహ్యంగా ఓటమిపాలవడంతో ఆయన ఇమేజ్ మసకబారింది. వరుస వివాదాలతో అటు ప్రజల్లోను ఇటు పార్టీలోనూ చింతమనేని ఇమేజ్ డ్యామేజ్ అయింది.

దెందులూరు వైసిపి ఎమ్మెల్యే కోఠారు అబ్బాయి చౌదరి గత ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్‌పై 18వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కోటారు అబ్బయ్య చౌదరి ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగెత్తించడంతో మరోసారి దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని సర్వేలు స్పష్టం చేశాయి. దీంతో టీడీపీ అధిష్టానం ఆలోచనలో పడింది. ఈసారి ఎలాగైనా దెందులూరు నియోజకవర్గంలో గెలవాలన్న లక్ష్యంతో టీడీపీ పావు లు కదుపుతోంది. చింతమనేని ప్రభాకర్‌ను పక్కనపెట్టి వేరే వారికి టిక్కెట్ ఇస్తే. ఎలా ఉంటుందన్న చర్చ సాగుతోంది.

చింతమనేని కంటే దీటైన అభ్యర్థిగా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబుని బరిలో దింపాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం గతంలో ఈ సీటుకు మాగంటి బాబు ప్రాతినిధ్యం వహించారు. దెందులూరు నియోజకవర్గంతో మాగంటి బాబు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మాగంటి తల్లిదండ్రుల వద్ద నుంచి ఈ నియోజకవర్గం మాగంటి బాబు కుటుంబాన్ని ఆదరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి మాగంటి బాబును బరిలో దింపాలని అధిష్టానం చూస్తున్నట్లు సమాచారం.

ఏలూరు పార్లమెంటుకు పోటీ చేయాలనుకుంటున్న మాగంటి బాబు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్నది తెలియాలి. మాగంటి బాబుకు ఎంపీ స్థానం కేటాయించే పరిస్థితి పార్టీలో లేకపోవడంతో ఈసారి మాగంటి బాబు ను ఎమ్మెల్యేగా ఎంపిక చేస్తే బాగుంటుందని టీడీపీ అభిమానులు భావిస్తున్నారు దెందులూరు నుంచి మాగంటి బాబు పోటీ చేస్తే వైసిపికి చెక్ పెట్టినట్టు అవుతుందని వారి భావన. మరో పక్క చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలి కూడా పార్టీ పెద్దలకు ఇబ్బందికరంగా మారింది. ఆయన నోటి దురుసుతనం పార్టీకి మైనస్‌గా తయారైందని, సొంత సామాజిక వర్గం నేతలే విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చింతమనేని ప్రభాకర్ కంటే మాగంటి బాబు బెటర్ క్యాండిడేట్ అవుతారని వారు విశ్లేషిస్తున్నారు.

చింతమనేని ప్రభాకర్ సీటు మారుస్తారన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి ఈసారి నూజివీడు నుండి పోటీ చేస్తారని కూడా గుసగుసలున్నాయి. దెందులూరు నియోజకవర్గం ఆనుకొని ఉన్న నూజివీడు నియోజకవర్గ నుంచి చింతమనేని రంగంలో దింపితే నూజివీడు దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం ఖాతాలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు ఈ ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్య కావడంతో ప్రతి సీటుపై పార్టీ గట్టిగానే కసరత్తు చేస్తోంది. చింతమనేని ప్రభాకర్ అనుచరులు మాత్రం దెందులూరును వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు గత ఎన్నికల్లో జరిగిన ఓటమికి ఈసారి బదులు తీర్చుకుంటామని సవాల్ విసురుతున్నారు. పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలిమరి.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్