హైదరాబాద్ మలక్ పేట్ గోల్డ్ షాప్ చోరీ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. బంగారం దుకాణంలో చోరీకి పాల్పడ్డ ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్క రాష్ట్రంలో నిందితులను పట్టుకున్న పోలీసులు.. హైదరాబాద్ తీసుకొస్తున్నారు. అక్బర్ బాగ్‌లోని బంగారం దుకా ణానికి బైక్‌పై వచ్చిన ముగ్గురు ఆగంత కులు దుకాణంలోకి చొరబడి యజమానిని కత్తితో బెదిరిం చారు. అనంతరం బంగారు వస్తువుల్ని దోచుకెళ్లారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన స్ధానికంగా సంచలనం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో సీసీ టీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేప ట్టారు. దోపిడీకి పాల్పడింది పాత నేరస్తులేనని గుర్తించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.