23.7 C
Hyderabad
Monday, March 17, 2025
spot_img

కాళేశ్వరం రైతుల కోసమా! కాంట్రాక్టర్ల కోసమా!

        రైతుల కోసం తమ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చిందని భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వం గొప్పలు చెప్పు కోవ డాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ఎద్దేవా చేసింది. వాస్తవానికి రైతుల కంటే కాంట్రాక్టర్లకే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఉపయోగపడిందని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టింది. అంతేకాదు ప్రాజెక్ట్‌ కు సంబంధించిన అనేక వాస్తవాల ను గులాబీ పార్టీ సర్కార్ దాచి పెట్టిందని రిపోర్ట్ వెల్లడించింది.

    కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అనేక కోణాల్లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విశ్లేషించింది. తెలంగాణ శాసనసభకు సమ ర్పించిన నివేదికలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ తీరు, ప్రాజెక్ట్ డిజైన్, ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు చోటు చేసుకున్న సమస్తలోపాలను కాగ్ తన నివేదికలో బట్టబయలు చేసింది. అప్పట్లో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగితే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని కాగ్ రిపోర్ట్ వెల్లడించింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఇప్పట్లో పూర్తిస్థాయిలో కంప్లీట్ కాదని నివే దిక పేర్కొంది. ప్రాజెక్ట్ నూటికి నూరు శాతం పూర్తయి, ఆశించిన ఫలాలు అందాలంటే అనేక సంవత్సరాలు పడుతుం దని కాగ్ నివేదిక వ్యాఖ్యానించింది.

    కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై గత ప్రభుత్వం బయటి ప్రపంచానికి అనేక గొప్పలు చెప్పుకుందని కాగ్ నివేదిక పేర్కొంది. అంతే కాదు ప్రాజెక్ట్‌కు సంబంధించి తప్పడు గణాంకాలు కూడా చూపించిందని కాగ్ తన నివేదికలో కుండబద్దలు కొట్టింది. ప్రాజెక్ట్ ఖర్చు, దాని నుంచి వచ్చే ప్రయోజనం విషయంలో కూడా తప్పుడు లెక్కలు చూపించిందని రిపోర్ట్ పేర్కొంది. ప్రతి రూపాయి ఖర్చుకు రూపాయిన్నర ప్రయోజనం ఉంటుందని డీపీఆర్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పిన విషయాన్ని కాగ్ ప్రస్తావించింది. అయితే భవిష్యత్తులో రూపాయి ఖర్చుకు 52 పైసల ప్రయోజనమే దక్కుతుందని కాగ్ రిపోర్ట్ వెల్లడించింది. ఒక్కో టీఎంసీకి దాదాపు 17,668 ఎకరాల మేర సాగు అవుతుందని డీపీఆర్‌లో గత ప్రభుత్వం పేర్కొందని నివేదిక తెలియచేసింది. అయితే వాస్తవానికి ఒక టీఎంసీ నీరుతో కేవలం 10 వేల ఎకరాలకే ప్రయోజనం లభిస్తుందని కాగ్ రిపోర్ట్ పేర్కొంది. పాత ప్రాణహిత – చేవెళ్ల డిజైన్ ద్వారా రంగారెడ్డి జిల్లాలో 2.47లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకుంటే, కాళేశ్వరం రీ డిజైనింగ్‌ వల్ల ఆ జిల్లాలో సాగు ప్రయోజనం 50 వేల ఎకరాల కంటే తక్కువ భూమికి పరిమి తమైందని కాగ్ నివేదిక పేర్కొంది.

       మొత్తం 21 ప్యాకేజీలకు సంబంధించిన అగ్రిమెంట్లలో కేవలం నాలుగు ప్రాజెక్ట్‌ల వివరాలను మాత్రమే గత ప్రభు త్వం ఇచ్చిందని కాగ్ నివేదిక పేర్కొంది. మిగిలిన అగ్రిమెంట్ల వివరాలను రకరకాల కారణాలు చూపించి పాత ప్రభు త్వం అందచేయలేదని పేర్కొంది. అంతేకాదు వివరాలు అందచేసిన నాలుగు ప్రాజెక్ట్‌లకు సంబంధించి కూడా ముఖ్య మైన విషయాలను తారుమారు చేసిందని వెల్లడించింది. మోటార్ల కొనుగోలుకు సంబంధించి ధరలను ఇష్టం వచ్చిన ట్లు పెంచారని కాగ్ నివేదిక దుయ్యబట్టింది. టోటల్‌గా రూ. 5,525 కోట్ల మేర ఎక్కువ పేమెంట్ చేశారని కాగ్ స్పష్టం చేసింది. మొత్తంమీద గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ది చేకూరిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ పేర్కొంది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని ప్యాకేజీల్లోనూ ఇది జరిగిందని వివరించింది. మొత్తంగా దీని విలువ చాలా ఎక్కువగా ఉంటుందని రిపోర్ట్ వెల్లడించింది. ఇక ఆయకట్టు విషయంలోనూ ప్రభుత్వం చెప్పినలెక్కలు, ఆయా సర్కిళ్ల ఇంజనీర్లు చెప్పిన లెక్కల మధ్య ఎక్కడా పొంతన లేదని దుయ్యబట్టింది రిపోర్ట్. కాగా కాళేశ్వరం ఎత్తి పోతల విద్యుత్ వినియోగం తక్కువేనని పేర్కొంటూ, ఒక్కో యూనిట్ ధరను సగానికి పైగా తగ్గించి గత ప్రభుత్వం డీపీఆర్‌లో చూపించిందని కాగ్ నివేదికలో పేర్కొంది. అయితే ప్రాజెక్ట్ అనుమతికి సమర్పించే కాగ్ నివేదికలో వాస్తవ ఖర్చు, ఏడాదిపాటు నిర్వహణకు అయ్యే ఖర్చును తక్కువగా చూపించి ఎక్కువ ప్రయోజనాలు వస్తాయని గత ప్రభుత్వం అందరినీ నమ్మించిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక పేర్కొంది.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్