23.7 C
Hyderabad
Monday, March 17, 2025
spot_img

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సగం వేస్ట్ – కాంగ్రెస్

      భారత్ రాష్ట్ర సమితి గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు గుట్టు రట్టు చేసింది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం జరిగిన ఖర్చులో సగం వృధా అని కుండబద్దలు కొట్టింది. అంతేకాదు ప్రాజెక్ట్ డిజైన్ నుంచి నిర్మాణం వరకు అనేక లోపాలున్నాయని కాగ్ నివేదిక తెగేసి చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికను తొలిసారి శాసనసభలో ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి నాయ కత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. సహజంగా గతంలో బడ్జెట్ సమావేశాల చివరిరోజు కాగ్ నివేదికలను సభ లో ప్రవేశపెట్టేవారు.అదొక ఆనవాయితీగా ఉండేది. ఇలా చివరి రోజు ప్రవేశపెట్టడం వల్ల కాగ్ నివేదికపై పెద్దగా చర్చ జరిగేది కాదు. అయితే ఈసారి అందుకు భిన్నంగా సభలో ప్రవేశ పెట్టింది కాంగ్రెస్ ప్రభు త్వం.

      కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 260 పేజీల నివేదికను కాగ్ సమర్పించింది. ఈ నివేదికలో గతంలో గులాబీ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను కాగ్ రిపోర్ట్ ఎండగట్టింది. ప్రాజెక్ట్‌ కోసం రూపాయి ఖర్చు పెడితే అందులో 48 పైసలు వృధా అయ్యాయని కాగ్ నివేదిక పేర్కొంది. అసలు ఆదాయమే లేని కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు 2022 మార్చి నాటికే గత ప్రభుత్వం రూ. 86,788 కోట్లు ఖర్చు చేసిందని ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఇలాగే దుబారా చేస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మొత్తం పూర్తి అయ్యేనాటికి రూ. 1,41,545 కోట్లకు చేరుకుంటుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ పేర్కొంది.

    కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి చేసిన అప్పుల గురించి కూడా కాగ్ తన నివేదికలో ప్రస్తావించింది. ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం పెట్టిన మొత్తం ఖర్చులో 72.82 శాతాన్ని అప్పుల ద్వారానే గత ప్రభు త్వం నిధులు సమకూర్చుకుందని నివేదిక కుండబద్దలు కొట్టింది. కాగా ప్రాజెక్ట్‌ కోసం చేసిన అప్పులను తీర్చడానికి దాదాపు 14 సంవత్సరాలు పడుతుందని కాగ్ నివేదిక అంచనా వేసింది. మొత్తం అప్పులు తీర్చడానికి ప్రతి ఏడాది సగటున రూ. 14,462 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని రిపోర్ట్ వెల్లడించింది. అయితే రెండేళ్ల కిందటి నుంచే అప్పులు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. ఇదిలా ఉంటే, డబ్బులు లేవంటూ గతప్రభుత్వం అప్పులు చెల్లించడానికి గడువు కోరిందని కాగ్ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యం లో రుణాలు చెల్లించకపోవడంతో వడ్డీ పెరిగిందని రిపోర్ట్ వెల్లడించింది. పెరిగిన ఈ వడ్డీ ప్రస్తుతం ప్రభుత్వానికి భారంగా మారిందని కాగ్ రిపోర్ట్ తెలియచేసింది.

    వాస్తవానికి ఒప్పందం ప్రకారం 2020-21 నుంచే తీసుకున్న అప్పులు చెల్లించాల్సి ఉందని నివేదిక వెల్లడించింది. అయితే డబ్బులు లేకపోవడంతో సర్కార్ రెండేళ్లపాటు అదనపు గడువు కోరిందని పేర్కొంది. దీంతో సర్కార్ చెల్లించా ల్సిన వడ్డీ కూడా భారీగా పెరిగిందని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తరచూ మారే అంశాన్ని కూడా కాగ్ నివేదిక ప్రస్తావించింది. వడ్డీలు పెరిగితే చెల్లించాల్సిన అప్పులు కూడా పెరుగుతాయని రిపోర్ట్ పేర్కొంది. చివరకు ప్రాజెక్ట్ కోసం గులాబీ పార్టీ సర్కార్ చేసిన అప్పులు ప్రస్తుత ప్రభుత్వానికి గుదిబండగా తయార వుతున్నాయని కాగ్ నివేదిక పేర్కొంది. రుణాలకు సంబంధించి అవసరమైన నిధులను సమకూరుస్తామని అప్పటి ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ సర్టిఫికెట్ ఇచ్చిన విషయాన్ని కూడా కాగ్ రిపోర్ట్ పేర్కొంది. అయితే అప్పటికే రుణాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటైన విషయాన్ని కూడా కాగ్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాదు రుణాలు తీసుకోవడానికి కూడా సిద్ధమైందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక పేర్కొంది. వివిధ ఆర్థిక సంస్థల నుంచి సదరు కార్పొరేషన్ 2022 మార్చి నాటికే రూ. 87.449 కోట్లను ప్రభుత్వ గ్యారంటీతో రుణంగా తీసుకుందని రిపోర్ట్ స్పష్టం చేసింది.

     అసలు ప్రాజెక్ట్ మొత్తానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇవ్వలేదన్న వాస్తవాన్ని కాగ్ నివేదిక వెల్లడించింది. అలాకాకుండా విడివిడి పనులకు వేర్వేరుగా గత ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు నిర్దిష్ట మైన ఫండింగ్ విధానం అంటూ ఏమీలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ తెగేసి చెప్పింది. అయినప్పటికీ 2022 మార్చి నాటికి మొత్తం 73 పరిపాలనా అనుమతులు ఇచ్చిందని రిపోర్ట్ పేర్కొంది. దీని కోసం రూ. 1,10,248 కోట్ల ను గత ప్రభుత్వం విడుదల చేసిందని కాగ్ వెల్లడించింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిన తీరునే కంప్ట్రో లర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక తప్పుపట్టింది. నిర్దిష్టమైన ప్లాన్ లేకుండా హడావిడిగా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని కాగ్ తన రిపోర్ట్‌లో తప్పుపట్టింది. కేంద్ర జలసంఘానికి పంపిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌కు అనుమతి రాకముందే అప్పటి గులాబీ పార్టీ ప్రభుత్వం 2018లో మొత్తం 17 పనులను చేపట్టిందని నివేదిక పేర్కొంది. డీపీఆర్‌కు అనుమతి లభించిన తరువాత డిజైన్‌లో మరికొన్ని మార్పులు చేసిందని రిపోర్ట్ వెల్లడించింది. పాత రేట్ల ప్రకారం రూ. 63,352 కోట్లుగా మొత్తం అంచనా వ్యయాన్ని డీపీఆర్‌లో ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే రూ. 1.47 లక్షల కోట్ల వ్యయం అయ్యేలా ఉన్నదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఎకరానికి సాగునీటి సౌకర్యం కల్పించాలంటే రూ. 6.42 లక్షల కోట్ల మేర ఖర్చు అవుతుందని కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. మొత్తంమీద కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి అనేక విషయాల్లో జరిగిన లోపాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక గణాంకాలతో సహా ఎత్తి చూపింది.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్