భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కార్డ్ ఆధారిత వాణిజ్యపరమైన చెల్లింపులను వెంటనే నిలిపి వేయవలసిందిగా వీసా, మాస్టర్ కార్డ్ సంస్థలను ఆదేశించింది. కేవైసీ సమ్మతిపై ఆందోళ నలలు తలెత్తడంతో చిన్న, పెద్ద వ్యాపారాలు చేసే కార్డు ఆధారిత వాణిజ్య చెల్లింపులను నిలిపి వేయాలని అంతర్జాతీయ చెల్లింపుల దిగ్గజం వీసా, మాస్టర్ కార్డ్ లను రిజర్వ్ బ్యాంక్ కోరింది. వెంటనే వాణిజ్య పర మైన చెల్లింపులను నిలిపి వేస్తున్నట్లు వీసా సంస్థ ఫిబ్రవరి 8నే రిజర్వు బ్యాంక్ కు వర్తమానం పంపింది. మాస్టర్ కార్డ్ సంస్థ నుంచి ఆర్ బీఐకి స్పందన అందాల్సిఉంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ రెగ్యులేటరీ చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ పరిణామాలుచోటుచేసుకున్నాయి. కేవైసీ నిబంధనలు పాటించకపోవడంపై ఆందోళనల కారణంగా వీసా, మాస్టర్ కార్డ్ లకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వాణిజ్యకార్డు చెల్లింపులను ఆమోదించే అధికారం లేని ఇతర వ్యాపార కేంద్రాల్లో చేసే లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు.