23.7 C
Hyderabad
Tuesday, February 27, 2024
spot_img

కళ్యాణదుర్గం టీడీపీలో టికెట్ల లొల్లి

      కళ్యాణదుర్గం టీడీపీ మూడుముక్కల ఆటలో ఎవరు కింగ్ అనే లొల్లి పోటాపోటీగా నడుస్తోంది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై అధిష్టానం దోబూచులాట ఆడుతోంది. ఇదిలా ఉంటే లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటున్నాయి స్థానిక టీడీపీ శ్రేణులు. గతంలో ఫ్లెక్సీలు చించుకొని ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి కల్యాణ దుర్గంలో వైసీపీ విజయం ఖాయమని, వైసీపీ నాయకులు బాహాటంగానే చెబుతున్నారు.

        అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీకి క్షేత్రస్థాయిలో బలమైన పట్టు ఉన్నప్పటికీ నాయకులు మధ్య సమన్వయం లోపంతో వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పరిస్థి తులు నెలకొన్నాయి. నియోజవర్గంలో టీడీపీ ఆరుసార్లు గెలుపొందినప్పటికి, 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరికి కాదని, కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబు పేరును అధిష్టానం ప్రకటించడంతో, నియోజకవర్గంలో ప్రచారానికి ఏర్పాట్లు పూర్తిచేసుకున్న తరువాత అధిష్టానం అనూహ్యంగా తెరపైకి టీడీపీ అభ్యర్థిగా మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేరును ప్రకటించింది. కాని మాజీ ఎమ్మెల్యే ఉన్నం హను మంతరాయ చౌదరి టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. ఐతే అధిష్టానం సూచనల మేరకు మాజీ ఎమ్మెల్యే ఉన్నం నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. మాజీ ఎమ్మెల్యే ఉన్నం వర్గం ఎన్నికల్లో టీడీపీకి సహకరించకపోవ డంతో కళ్యాణదుర్గంలో టీడీపీ ఓటమి పాలైందని టీడీపీ ఇంచార్జీ మదినేని ఉమా మహేశ్వరనాయుడు వర్గం ఆరోపించారు. ఇన్చార్జ్ లోకల్ కాకపోవడం వల్లే టీడీపీ ఓటమిపాలైందంటూ ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం ఆరోపణ.

       అధిష్టానం వద్ద కళ్యాణదుర్గం టీడీపీ వర్గ పోరు పై పలుమార్లు పంచాయతీ జరిగినప్పటికి, ప్రయోజనం లేకుండా పోయింది. మీరు చెప్తే మేం వినాల అనే రీతిలో పార్టీ ఆదేశాలను భేఖాతరు చేస్తూ కళ్యాణ దుర్గం టీడీపీలో వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు. మండల కమిటీలు వేయడానికి అధిష్టానం నుండి వచ్చిన నేతల ముందే ఇరువర్గాలు కుర్చీలతో బాహాబాహీకి దిగిన సందర్భాలు ఉన్నాయి . రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ మధ్య కళ్యాణదుర్గంలో చేపట్టిన బస్సు యాత్ర కూడా అడుగుడున అడ్డంకులతో రచ్చ రచ్చ జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు స్వయంగా నేతలకు ఫోన్ చేసి బస్సు యాత్రలో ఎలాంటి గొడవలు సృష్టించవద్దని చెప్పిన ఇక్కడి నేతలు తమ పంతాలకే ప్రాధాన్యత ఇచ్చారు.

      తెలుగు దేశం పార్టీ అధినేత కళ్యాణదుర్గం పర్యటనలో వర్గ పోరు పోటా పోటీగా సాగినప్పటికీ అధినేత మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థి పై క్లారిటీ ఇవ్వకుండా వెళ్లడంతో, వర్గ పోరు మరింత తారస్థాయికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంచార్జ్ ల ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమాలను చేపట్టాలని అధిష్టానం సూచించ్చినప్పటికి, కళ్యాణదుర్గంలో ఇన్చార్జితో కలిసి పనిచేసేది లేదంటూ సీనియర్ వర్గం అధిష్టానానికి తెగేసి చెప్పింది. వచ్చే ఎన్నికల్లో అనూహ్యంగా మూడో వ్యక్తిని తెరపైకి తీసుకురావాలనే అధిష్టానం, ఈ వర్గపోరును కట్టడి చేయడంలో మీనమేషాలు లెక్కిస్తుందోనని కార్యకర్తల నుండి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ రేసులో, ప్రస్తుత ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు తోపాటు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి , ఎస్. ఆర్. కన్స్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్రబాబు ఉన్నట్లు సమాచారం. మరి 2024 ఎన్నికల్లో కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ ఈసారి ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే…

Latest Articles

‘ఆపరేషన్ వాలెంటైన్’ విజువల్ ఫీస్ట్ లా వుంటుంది – చిరంజీవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్