ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిజాయితీగా ఉంటూ, అవినీతికి అడ్డుకట్టవే యాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ కోరారు. ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థల గౌరవాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కృష్ణాజిల్లా కలెక్టర్ రాజబాబు నిజాయితీగల కలెక్టర్ అంటూనే శ్రీకాకుళం, పాపవినాశనం గ్రామాలలో జరిగే అక్రమ ఇసుక తవ్వకాలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీకాకుళం గ్రామస్తులు ఎన్నిసార్లు కలెక్టర్ కి ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. తొట్లవల్లూరు వెళ్లి అక్కడ ఇసుక అక్రమ రవాణా జరగడం లేదని ఎస్ఈటి రిపోర్టులో వ్రాయడం ఎంతవరకు సమంజసం అని బుద్దప్రసాద్ ప్రశ్నించారు. తోట్లవ ల్లూరు వెళ్లిన కలెక్టర్ కి పక్కనే ఉన్న శ్రీకాకుళం, పాపవినాశనం వద్ద విచ్చల విడిగా ఇసుక అక్రమ రవాణా కనిపించలేదా అని ప్రశ్నించారు.