అయోధ్యలో బాల రాముడి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. రామ మందిర తలుపులు సామాన్య భక్తులకు తెరు చుకోవటంతో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ నుంచి స్వామివారి దర్శన భాగ్యానికి సామాన్యులను అనుమతించారు. భక్తులు సోమవారం అర్ధరాత్రి నుంచే మందిరం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రభుత్వం ముం దు జాగ్రత్తగా భారీ ఎత్తున బలగాలను మోహరించింది. రాముడి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్‌కార్డు లాంటి ఏదో ఒక గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి. హారతి కార్యక్రమానికి ఉచితంగానే పాస్ ఇస్తారు కానీ అవి పరిమితంగా ఉంటాయి. ఆన్లైన్లో కానీ, ప్రత్యక్షంగా ఆలయం వద్ద కానీ పాస్ తీసుకున్న వాళ్లకే ఆ సమయంలో అను మతిస్తారు. పదేళ్లలోపు పిల్లలకు మాత్రమే మినహాయింపు ఉంది. ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, మధ్యా హ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. సోమవారం ఘనంగా జరిగిన ప్రాణప్రతిష్ఠ తర్వాత కేవలం అతిథులు మాత్రమే శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఇక నుంచి సామాన్య భక్తులందరూ బాలరా ముడిని దర్శించునే అవకాశం కల్పించారు. దాంతో భక్తులు తాకిడి అధికంగా ఉంది.


