రెండురోజుల్లో గుడ్‌న్యూస్ చెప్తానని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ అన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలకు సిద్ధమ వుతున్నామని… తమకు మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తుకు సంబంధించిన నిర్ణయాన్ని రెండురోజుల్లో ప్రకటిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో అధికార DMK – MNM మధ్య పొత్తుపై వార్తలు వస్తున్నాయి. దీని గురిం చి కొద్దినెలల క్రితం డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సూచనప్రాయంగా పేర్కొన్నారు. అలాగే సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సమయంలో కమల్ మద్దతుగా నిలిచారు. గత ఏడాది జరిగిన ఈరోడ్ ఉప ఎన్నికలో డీఎంకే నిలబెట్టిన అభ్యర్థిని MNM బలపరిచింది. 2018లో ఈ స్టార్ నటుడు MNM పార్టీని స్థాపించారు. 2019, 2021లో జరిగిన లోక్‌సభ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.


