పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2018 పరువునష్టం దావా కేసులో రాహుల్ కోర్టుకు హాజరయ్యారు. రాహుల్ తరుపు న్యాయవాదుల వాదన విన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2018లో బెంగళూరులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై రాహుల్ గాంధీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆ కేసును తాజాగా విచారిం చిన కోర్టు.. బెయిల్ మంజూరు చేసింది. దాంతో భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు రాహుల్ వెళ్లిపోయారు.


