29.4 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

భవిష్యత్తుపై ఆశలు పెంచిన కేంద్రం మధ్యంతర బడ్జెట్

    లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక రంగాలకు పెద్దపీట వేస్తూ, మూలధన వ్యయంపై నిబద్ధతతో కూడిన 2024-25 మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ రోడ్ మ్యాప్ ను వివరించే ప్రయత్నం చేశారు. దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ లో కొత్తగా ఎలాంటి పన్ను ప్రతిపాదనలు చేయలేదు. దాదాపు 25 వేల వరకూ అన్ని వివాదాస్పద ప్రత్యక్ష పన్ను డిమాండ్లను ఆర్థిక మంత్రి ఉపసంహరించారు. దీనివల్ల కోటి మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించింది.

నరేంద్రమోదీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో దేశంలో పేదరికం నిర్మూలనకు బహుముఖ పథకాలను అమలు చేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పేదలకు జన్ ధన్ ఖాతాల ద్వారా 34 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందిందన్నారు. 78 లక్షలమంది వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం చేసారన్నారు. అలాగే 2.30 లక్షల కోట్ల రూపాయలు పూచీకత్తు లేని రుణాలు అందించినట్లు ఆర్థికమంత్రి వివరించారు. రైతుల సంక్షేమానికి, వారి పంటలకు కనీస గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ప్రభుత్వం గట్టి కృషి చేసిందన్నారు ఆర్థికమంత్రి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 11కోట్ల 80 లక్షల మంది రైతులకు ఆర్థిక సహాయం కల్పించామన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికత కల్పించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. 2 కోట్ల మంది రైతులకు ఫసర్ బీమా యోజన కింద పంటల బీమా అందించినట్లు తెలిపారు. నానో యూరియా, నానో డీఏపీ కింద ఎరువులు రైతులకు అందించినట్లు తెలిపారు.

యువత కోసం స్కిల్ ఇండియా మిషన్ కింద కోటీ 40 లక్షల మందికి వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. గత పదేళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల ఐఐటీలు, ఏడు ఐఐఎంలు, 15 ఆలిండియా మెడికల్ సైన్సెస్ ఆస్పత్రులు, 390 యూనివర్సిటీలను ఏర్పాటు చేసినట్లు నిర్మల తెలిపారు. మరిన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి తెలిపారు. యువతకు ముద్రా యోజన కింద 25 లక్షల కోట్ల రూపాయలు రుణాలుగా కల్పించి ప్రోత్సహించినట్లు ఆర్థికమంత్రి వివరించారు. మహిళలకు అన్నిరంగాల్లోనూ 33 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు.

మహిళా విద్యను ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలవల్ల గత పదేళ్లలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న మహిళల సంఖ్య 28శాతం పెరిగినట్లు తెలిపారు. ఆశాలు, అంగన్ వాడీలకు ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపజేసినట్లు తెలిపారు. 9-18 ఏళ్ల మధ్య ఉన్న బాలికల్లో చాలామంది సర్వైకల్ కాన్సర్ బారిన పడకుండాచర్యలు చేపట్టినట్లు తెలిపారు. లక్ పతీ దీదీ పథకం కింద రెండు కోట్ల నుంచి మూడు కోట్ల మహిళల ఆర్థిక స్థితి మెరుగు పరుస్తున్నట్లు తెలిపారు. స్వయం సహాయక బృందాల కృషి వల్ల కోటి మంది మహిళలు లక్షాదికారులయ్యారన్నారు.పాడి పరిశ్రమ, ఆక్వా మత్స్య రంగాల అభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశం ముందంజలో ఉందని ఆమె తెలిపారు. పాడి రైతుల ప్రోత్సాహానికి సమగ్ర పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఐదు సమీకృత అక్వా పార్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మధ్యతరగతి కోసం కొత్త గృహనిర్మాణ పథకం అమలు చేస్తామని, ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఇప్పటికే 3 కోట్ల ఇళ్లు నిర్మించామని, వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మించి, అందరికీ గృహసౌకర్యం కల్పిస్తామని ఆర్థికమంత్రి తెలిపారు. బస్తీలు, అద్దె ఇళ్లల్లో ఉంటున్న ప్రజలకు సొంత ఇంటి కలను నిజం చేస్తామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద రెండు కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద ఇళ్లపై సోలార్ ప్యానెల్ లు ఏర్పాటు చేసుకునే కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ కల్పిస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్ లో నిర్మల ముఖ్యంగా యువజన, మహిళా సంక్షేమం, రైతులు, పేదవర్గాల ప్రయోజనాలపై ప్రధానం గా దృష్టి పెట్టారు. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో ఈ రంగాలకు ప్రాధాన్యం కల్పించినట్లు స్పష్టమవుతోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్