టీవీలో వచ్చే బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసి, ఆ పై సినిమాఛాన్స్ పట్టేద్దామని ఆశపడిన ఓ యువతి అడ్డంగా మోస పోయింది. బిగ్ బాస్ లోకి పాల్గొనే ఛాన్స్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ జూబ్లీహిల్స్ కంప్లెయిం ట్ చేసింది స్వప్ప అనే యువతి.. మాటీవీలో ప్రొడక్షన్ ఇన్చార్జ్ గా పనిచేస్తున్న సత్య గత జూన్ లో రెండున్నర లక్షలు తీసుకున్నాడని.. అయినా బిగ్ బాస్ లోకి పంపించలేదని ఫిర్యాదులో పేర్కొంది.. తన డబ్బులు తనకు ఇవ్వాలని కోరగా బెదిరిస్తున్నాడని ఆరోపించింది. కాస్ట్యూమ్స్, పీఆర్ ఖర్చుల కోసం 5 లక్షల వరకు ఇవ్వాలని డిమాండ్ చేయగా రెండు న్నర లక్షలు ఇచ్చానని తెలిపింది స్వప్న..
ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్న ఈవెంట్స్ లో యాంకర్ గా పనిచేస్తుంది.. రెండు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కూడా యాక్ట్ చేసింది. ఈ సమయంలోనే మాటీవీలో పనిచేస్తున్న సత్య పరిచయమయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 7 కి పంపిస్తానని హామీ ఇచ్చాడు.. తమ్మలి రాజు అనే వ్యక్తిని పరిచయం చేసి.. ఇతనే బిగ్ బాస్ కి ఇన్చార్జ్ అని చెప్పాడు.. బిగ్ బాస్ కి వెళ్లడానికి ఐదు లక్షల ఖర్చు అవుతుందని చెప్పాడు.. బిగ్ బాస్ లో కాస్ట్యూమ్స్, పీఆర్ ఖర్చుల కోసం పే చేయాలన్నాడు. దీంతో రెండున్నర లక్షలు అతనికి ఇచ్చానని చెప్పింది యాంకర్ స్వప్న.
ఒకవేళ అవకాశం రాకుంటే డబ్బులు తిరిగి ఇచ్చేస్తా అని తనను నమ్మించాడని చెబుతోంది స్వప్న. దీనికి సంబం ధించి అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడని.. చివరి క్షణం వరకూ బిగ్ బాస్ కి పంపిస్తానని మోసం చేశాడని ఆరోపిస్తోంది.. డబ్బుల గురించి ప్రశ్నించగా తాను ఇవ్వనని, మళ్లీ అడిగితే ఊరుకోనని బెదిరించాడని చెబుతోంది. తాను మోసపోయా నని గ్రహించిన స్వప్న జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.. పీఎస్ లో తమ్మలి రాజు, సత్య పై ఫిర్యాదు చేసింది. కంప్లెయింట్ తీసుకున్న పోలీసులు ఇద్దరిపై 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీజన్ స్టార్ట్ అయినా తన పేరు లేకపోవడంతో రాజును స్వప్న చౌదరి నిలదీసింది. సీజన్-7 ఉల్టా పుల్టా కావడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని మరో సారి చీట్ చేసినట్లు ఆరోపిస్తోంది. నిలదీయడంతో తనని బెదిరించినట్లు చెబుతోంది. అంతే కాకుండా గతంలో నూ రాజు మరో సంస్థలో పనిచేసినప్పుడు కూడా చాలా మంది అమ్మాయిలను మోసం చేయడం కారణంగా అక్కడ ఉద్యోగం నుంచి తొలగించినట్లు అరోపించింది. చాలా రియాల్టీ షో పేర్లతో మోసాలకు దిగుతున్నట్లు జూబ్లీహిల్ప్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతోంది స్వప్న. పోలీసుుల కేసు బుక్ చేసుకుని ఆమె ఆరోపిస్తున్న ఇద్దరు వ్యక్తులు సత్య, తమ్మలి రాజు కోసం గాలిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవడంతోపాటు తన డబ్బులు తిరిగి ఇప్పించాల ని కోరుతోంది బాధిత యువతి.


