ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదం కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై లుకవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ప్రమాద సమయంలో తన కుమారుడిని తప్పించడానికి సహకరించాడు షకీల్. రాహిల్‌తో పాటు షకీల్ కూడా దుబాయ్‌కి పారిపోయాడని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే పంజాగుట్ట ఇన్స్‌పెక్టర్‌తో పాటు బోధన్ ఇన్స్‌పెక్టర్‌ను కూడా అరెస్ట్ చేశామన్నారు. నిందితుడికి పోలీసులు సహకరిం చినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేయగా.. ఏడుగురు ఇంకా పరారీలో ఉన్నారని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.