నేటి నుంచి నాంపల్లిలో 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభం . సకల హంగులతో ముస్తాబైన నాం పల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుమాయిష్ సీఎం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం . 2400 స్టాల్స్ ఏర్పాటు చేయ నున్న నిర్వాహ కులు. 45 రోజుల పాటు నగరవాసులకు అందుబాటులో ప్రత్యేక బస్సులు నడపనున్న తెలంగాణ ఆర్టీసీ .
83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌కు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముస్తాబైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నారు.ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఎగ్జిబిషన్‌లో దే శం నలుమూలల నుంచి వచ్చే వ్యాపారులు సుమారు 2400 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 25 లక్షల వరకు సందర్శకులు వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సొసైటీ ప్రతిని ధులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా గతంలో ఎంట్రీ టికెట్ 30 ఉండగా ఈసారి దానిని 40కి పెంచారు.
సాధారణ రోజులలో సాయంత్రం 3.30 గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోకి సందర్శకులను అనుమతిస్తారు. నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను దృష్టిలో పెట్టుకొని టీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపనుంది. ప్రత్యే కంగా మెట్రో రైల్ కోసం స్పెషల్ టికెట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సంవత్సరం నుమాయిష్లో శాఖాహార రెస్టారెంట్లు కూడా అందుబాటులోకి తేనున్నారు. తాజాగా కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో లోనికి వచ్చేవారు తప్పనిసరి మాస్కులు ధరించాలని నిర్వాహకులు సూచించారు.
సుమారు 20 లక్షలకు పైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉండడంతో సొసైటీ నిర్వాహకులు భద్రతపై దృష్టి సారించారు. లోనికి వచ్చే ప్రతిఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్ గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీచేసి లోపలికి అనుమతిస్తారు. ఎగ్జిబిషన్ నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యారంగాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నారు. మహిళా కళాశాలలు, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజినీరింగ్, డిగ్రీ,ఐటీఐ కళాశాలలను నెలకొల్పుతూ విద్యావ్యాప్తికి నిరంతరం తోడ్పాటు అందిస్తున్నారు. ఎగ్జిబిషన్ మైదానంలో పిల్లలకు వినోదాన్ని పంచే ఆట బొమ్మలు, కొయ్యబొమ్మలు, కిచెన్ సామాన్లు, బట్టలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వంటి దుకాణాలు ఏర్పాటు చేశారు. పిల్లలు, పెద్దలు అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరికి కావలసినంత వినోదం పంచడానికి ఎన్నో రకాల స్టాళ్లు, జెయింట్ వీల్స్, మైదానంలో తిరిగేందుకు రైలు వంటివి అందుబాటులో ఉన్నాయి.