నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. అవు టర్ రింగ్ రోడ్డుపై నుంచి కిందకు పడిపోయింది. అవుటర్ రింగ్ రోడ్డుపై నుంచి అత్యంత వేగంగా వచ్చిన కారు.. అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఒకరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది.సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని సమీక్షించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, క్షతగాత్రలును కూడా సమీప ఆస్పత్రికి తర లించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కారులో ప్రయాణిస్తున్నవారందరూ యువకులే.. గచ్చి బౌలి నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.