దేశంలోని 15 రాష్ట్రాల్లో కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ కేసులు ప్రబలుతున్నాయి. 15 రాష్ట్రాల్లో 923 కేసులు నమో దైనప్పటికీ, కొవిడ్ సబ్ వేరియంట్ సోకిన వారిలో ఎక్కువ మంది ఇంట్లోనే చికిత్స చేయించుకుంటున్నారని వైద్యాధి కారులు చెప్పారు. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నిరంతరం నిఘా ఉంచాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కోరింది. దేశంలోని 15 రాష్ట్రాల్లో 923 కేసులు నమోదు అయ్యాయి. దేశంలోనే కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా 214 కేసులు నమోదయ్యాయని ఇండియన్ సార్స్ కొవిడ్ -2 జెనోమిక్స్ కన్సా ర్టియం డేటా తెలిపింది. మహారాష్ట్రలో 170 కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. కేరళలో 154 కేసులు, ఏపీలో 105, గుజరాత్ లో 76, గోవాలో 66 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
తెలంగాణ, రాజస్థాన్‌లలో 32 జేఎన్ 1 కేసులు, ఛత్తీస్‌గఢ్‌లో 25, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, హర్యానాలో 5, ఒడిశాలో 3, పశ్చిమ బెంగాల్‌లో 2, ఉత్తరాఖండ్‌లో ఒక కేసు వెలుగుచూసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలి పింది. దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ జేఎన్1 ఉప-వేరియంట్ సోకిన వారిలో ఎక్కువ మంది ఇంటి ఆధారిత చికిత్సను ఎంచుకుంటున్నందున తక్షణం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు చెప్పారు